గౌరవనీయులైన శాసనసభ్యులకు,
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టమై, అభివృద్ధి పధం వైపు పయనించాలన్నది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయం. అందరికీ విద్య హక్కు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పలు సంస్కరణలకు విద్యా శాఖ శ్రీకారం చుట్టిన సంగతి మీకు తెలుసు.
పాఠశాలలను ఆరు కేటగిరీలుగా (శాటిలైట్ ఫౌండేషనల్, ఫౌండేషనల్ స్కూల్, ఫౌండేషనల్ ప్లస్, ప్రీ-హౌ స్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ గా) పునర్వ్యస్థీకరణ/హేతుబద్దీకరణ చేస్తున్న విషయం మీకు విదితమే. విద్యార్ధులకు వెసులుబాటు ఉండేలా హేతుబద్దీకరణకు ఒక కిలోమీటరు పరిధిని నిర్దేశించడం జరిగింది. పాఠశాలలకు వెళ్లడానికి, పెద్ద రహదారులు, వాగులు, వంకలను దాటాల్సి రావడం వంటి పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినట్లయితే, వాటిని సరిదిద్దే చర్యల్లో మీరు భాగస్వాములు కావాల్సిందిగా మనవి.
గౌరవ భారత రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఈ నెల 18 వ తేదీన మీరు అసెంబ్లీకు (హెడ్ క్వార్టర్స్ కు వస్తున్నందున, పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే, వాటి గురించి లిఖిత పూర్వకంగా ఆ రోజున అందచేయవలసిందిగా విజ్ఞప్తి.
సమస్యలు, 'ఇబ్బందులను పరిష్కరించి, విద్యా రంగ వికాసానికి ముఖ్యంగా విద్యార్ధులకు మేలు కలిగేలా పునర్య్వస్థీకరణ ప్రక్రియ పూర్తి కావడానికి మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను.
అభినందనలతో.....
0 comments:
Post a Comment