జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులకు మరియు ఉపతనిఖీ అధికారులకు తెలియజేయునది ఏమనగా జగనన్న గోరుముద్ద (MDM) పథకం మరియు పాఠశాల పరిశుధ్యం పథకం పటిష్టంగా అమలు పరచడానికి 4 అంచెల పర్యవేక్షణ విధానాన్ని గతంలోనే IMMS యాప్ నందు రూపొందించడం జరిగింది. మరియొక్కసారి తమకు తెలియజేస్తూ ఈ క్రింది తెలిపిన విధముగా అందరూ IMMS యాప్ నందు MDM & SS వివరములు నమోదు చేయవలసినదిగా ఆదేశించడమైనది.
మొదటి అంచె: ప్రధానోపాధ్యాయులు మరియు పేరెంట్ కమిటీ (అటెండన్స్ మరియు ఇన్-స్పెక్షన్ ప్రతి రోజు చేయవలెను)
రెండవ అంచె: ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ (ఇన్-స్పెక్షన్ రోజు విడిచి రోజు చేయవలెను)
మూడవ అంచె: విలేజ్ ఆర్గనైజర్ (ఇన్-స్పెక్షన్ నెలకు రెండు సార్లు చేయవలెను)
నాల్గవ అంచె: అధికారులు (ఇన్-స్పెక్షన్ ఎప్పుడైనా చేయవచ్చును)
ఈ విద్యాసంవత్సరం ప్రారంభమయినప్పటినుండి ఇప్పటివరకు ఒక్కసారికూడ పర్యవేక్షణ చెయ్యని పాఠశాలల వివరములను ఈ క్రింది జతపరచడమైనది. MEOs/DIs ఈ విషయమై ప్రత్యేక దృష్టిసారించవలసినదిగా తెలియజేయడమైనది.
0 comments:
Post a Comment