KGBV Schools Transfers | కెజీబీవీల్లో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ

ఎంటీఎస్‌ లేకుండా వద్దంటున్న బోధనా సిబ్బంది

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో బోధనా సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిపై గత నెల 29న మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం ఇప్పుడు షెడ్యూలు ప్రకటించింది. ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని, 22, 23 తేదీల్లో వాటి పరిశీలన ఉంటుందని తెలిపింది. 26న సీనియారిటీ జాబితా ప్రదర్శించి, 27, 28 తేదీల్లో వాటిపై గ్రీవెన్స్‌ పరిశీలించాక, 29న తుది సీనియారిటీ జాబితా విడుదల చేస్తామని తెలిపింది. 30 నుంచి 1వ తేదీ వరకూ వెబ్‌ అప్షన్లు పెట్టుకోవాలని, 2న కొత్త స్టేషన్‌లో జాయిన్‌ అవ్వాలని ఆదేశించింది. ఐదేళ్లు సర్వీసు దాటిన ప్రిన్సిపాళ్లు, ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న సీఆర్‌టీలు, పీఈటీలు  పాత జిల్లాల ప్రాతిపదికనబదిలీ అవుతారని స్పష్టంచేసింది. దీనికి ఈ ఏడాది మే 31ని కటాఫ్‌ తేదీగా నిర్ణయించింది. 

అయితే,  కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసే తమకు వేతనాలు పెంచకుండా బదిలీలు చేయడం ఏంటని బోధనా సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. మినిమం టైం స్కేలు అమలుచేయాలని ప్రభుత్వం జీవో జారీచేసినా ఇప్పటికీ టీచర్లకు రూ.21755, ప్రిన్సిపాళ్లకు రూ.27755 వేతనం ఇస్తున్నారు. ఈ చాలీచాలని జీతాలతో కొత్త ప్రదేశాలకు ఎలా వెళ్ళగలమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. వేతనాలు పెంచిన తర్వాతే తమను బదిలీ చేయాలని కోరుతున్నారు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top