IIIT Admisiions | ఆగస్టులో 'ట్రిపుల్ ఐటీ' ప్రవేశాలు
ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో 2022– 23 విద్యా సంవత్సరంలో పీయూసీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుందని శ్రీకాకు ళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ పెద్దాడ జగదీశ్వరరావు తెలి డైరెక్టర్ జగదీశ్వరరావు పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'పదో తర గతి బెటర్మెంట్ ఫలితాలు విడుదలైన వెంటనే ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ప్రకటన వస్తుంది. నెలరోజుల వ్యవధిలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తిచేసి, సెప్టెంబరులో తరగతులు ప్రారంభిస్తాం. ఇక్కడి క్యాంపస్లో పీయూసీ ప్రథమ, ద్వితీయ, ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఇంజనీరింగ్ సెకండియర్ విద్యార్థులకు కూడా ఇక్కడే తరగ : తులు నిర్వహిస్తాం. ఇంజనీరింగ్ తృతీయ, ఫైనలియర్ తరగ : తులు మాత్రం నూజివీడులోనే జరుగుతాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపయోగపడేలా ల్యాబ్ల ఏర్పాటుకు రూ.1.23 కోట్లతో మూడు టెండర్లు పిలిచాం. ట్రిపుల్ ఐటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాల పెంపునకు త్వరలో ప్రకటన వెలువడు తుంది. దీనికి సంబంధించి నూజివీడులో వచ్చే నెల 4న సమా వేశం జరగనుంది. తీర్మానాలను గవర్నింగ్ కౌన్సిల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని సూపర్వైజరీ, టెక్నికల్, సబార్డి నేటర్ కేడర్లుగా విభజించి వారికి జీతాలు పెంచేం దుకు చర్యలు తీసుకుంటామ'ని డైరెక్టర్ ప్రొఫెసర్ జగదీశ్వరరావు తెలిపారు.
0 comments:
Post a Comment