బీఈడీ కోర్సుల ప్రారంభానికి దేశం లోని వివిధ ఐఐటీలు దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. ఆయన సోమవారం లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధా నంగా చెప్పారు. జాతీయ విద్యా విధానంలో చెప్పినట్లుగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహణ కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీ టీఈ) ఈ ఏడాది మేలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా సంస్థలు, యూనివర్సిటీల నుంచి దరఖాస్తులు ఆహ్వా నించినట్లు పేర్కొన్నారు. అందుకోసం ఖరగప్పుర్, మద్రాస్, గువాహటి, భువనేశ్వర్ ఐఐటీలు దరఖాస్తు చేశాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment