బదిలీలను స్కూల్ ఆధారంగా కాకుండా గ్రామం ఆధారంగా చేస్తామన్నారు. ప్రస్తుతం 2342 మంది ఉపాధ్యా యులకు సబ్జెక్టు కన్వర్షన్ అనుమతించామని చెప్పారు. ఉన్నత పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడికి 36 పీరియడ్స్ మించకుండా చూస్తామన్నారు. అన్ని సంఘాలు ఎస్జీటీ, ఎస్ఏలకు బదిలీలలో మ్యాగిజీమమ్ సర్వీస్ ఎనిమిదేళ్లు అడగగా.. చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ఎంటీఎఫ్ డిమాండ్లెన మున్సిపల్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీడీవో అధికారాలు, 59 పురపాలక సంఘాల పరిధిలోని ప్రాధమిక, ప్రాథమి కోన్నత పాఠశాలల్లో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకే డీడీవోలుగా పరిగణించి అధికారాలు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బదిలీ, ప్రమోషన్ షెడ్యూల్ విషయమై వారం రోజులలో మున్సిపల్ ఉపాధ్యాయుల అంశాలపై సంఘాలతో సమా వేశం ఏర్పాటు చేసి ప్రకటిస్తా మని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment