Whatsapp నుండి మీరు ఏదైనా గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యారు అనుకోండి? వెంటనే అందరికి తెలిసిపోతుంది. ఎందుకంటే, మీరు ఎగ్జిట్ అయిన వెంటనే ఆ నోటిఫికేషన్ అందరికి కనిపిస్తుంది.అయితే, ఇక ముందు వాట్సాప్ గ్రూప్ నుండి మీరు ఎగ్జిట్ అయిన సంగతి ఎవరికీ తెలియకుండా చేయవచ్చు. ఇదేదో తర్డ్ పార్టీ యాప్ తో చేసే ట్రిక్ అనుకోకండి. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అందించడంలో ముందుండే వాట్సాప్, ఇప్పుడు ఈ ఫీచర్ ను కూడా తీసుకు వస్తోంది. ఈ అప్ కమింగ్ కొత్త ఫీచర్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు మరియు గ్రూప్స్ కి ఉపయోగకరంగా ఉండేలా తీసుకువస్తోంది.
మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యారనుకోండి, ఆ విషయం ఆ గ్రూప్ లో వున్నా ప్రతిక్కరికీ తెలిసిపోతుంది. అయితే, కొత్త అప్డేట్ తరువాత అలా జరగదు, వాట్సాప్ ఈ ట్రెండ్ ని మారుస్తోంది. ఇప్పుడు వస్తున్న కొత్త అప్డేట్ తో మీరు ఏదైనా గ్రూప్ నుండి ఎగ్జిట్ అయితే, ఆ విషయం ఆ గ్రూప్ లోని ఇతరులకు తెలియదు. అంటే, మీరు ఎవరికీ తెలియకుండా ఏ గ్రూప్ నుండైనా ఎగ్జిట్ కావచ్చు. మీరు ఎగ్జిట్ అయిన విషయం కేవలం గ్రూప్ అడ్మిన్ కు మాత్రమే తెలుస్తుంది. మీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఎవరికీ వెళ్లదు, ఇది ఈ కొత్త అప్డేట్ యొక్క అతిపెద్ద ప్రయోజనం.
ఈ కొత్త ఫీచర్ మరియు అప్డేట్ గురించి WABetainfo సమాచారం అందించింది. WABetainfo ఈ విషయాన్ని బ్లాక్ ద్వారా పోస్ట్ చేసింది. అంతేకాదు, వాట్సాప్ లో ఈ ఫీచర్ను త్వరలో వినియోగదారులకు తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్ వాడుతున్న వారికీ ఈ ఫీచర్ గురించి తెలిసే ఉంటుంది. ఈ ఫీచర్ ఇటీవలే బీట్ వెర్షన్ లో అంధుబాటులోకి వచ్చింది. వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగంలోకి వస్తుంది.
0 comments:
Post a Comment