రాష్ట్రంలో 292 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ఇంట ర్మీడియట్ను ప్రారంభించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పాఠశా లలను హైస్కూల్ ప్లస్ ఉన్నతీకరిస్తారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీల్లో రెండు గ్రూపులను ప్రారంభిస్తారు. ఈ కళాశాలల్లో పని చేసేందుకు 1,752 మంది స్కూల్ అసిస్టెంట్లను పీజీటీ లుగా ఉన్నతీకరిస్తారు. పొరుగుసేవల కింద రెండు బోధనేతర పోస్టులను ఇస్తారు. 'నాడు నేడు'లోనే అదనపు తరగతి గదులు నిర్మిస్తారు. సమగ్ర శిక్ష అభియాన్ నుంచే వీటన్నింటికి నిధులు విడుదల చేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment