లెసన్ ప్లాన్స్ లేని ఉపాధ్యాయులపై క్రమశి క్షణ చర్యలు తీసుకుంటామని డీఈవో బీ విజయ భాస్కర్ హెచ్చరించారు. సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ను శనివారం ఆకస్మికంగా ఆయన సందర్శించారు. ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గది లోకి లెసన్ ప్లాన్స్లోనే అడుగుపెట్టాలని తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు అందిస్తా మన్నారు. జేవీకే కిట్లను బయోమెట్రిక్ ద్వారానే అందించాలని ఆదేశించారు. ప్రతి రోజూ విద్యార్థుల హాజరు అటెండెన్స్ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. త్వరలో విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ ను సమర్ధవంతంగా నిర్వహించాలని, ప్రమాణాలు తక్కువగా ఉన్న విద్యార్థులకు రెమిడి యల్ టీచింగ్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఉపా ధ్యాయులకు డీఈవో సూచించారు. అనంతరం ఉపా ధ్యాయుల లెసన్ ప్లాన్స్న పరిశీలించారు. డీఈవో వెంట ఎస్ఎస్ఏ సీఎంవో కొండారెడ్డి, ఉపాధ్యా యులు ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment