బేస్లైన్ టెస్ట్ నందు మౌఖిక పరీక్ష నిర్వహణకు సూచనలు
తెలుగు
🌼ఒక్కొక్క విద్యార్థిని పిలిచి మొదటగా ఇచ్చిన ప్రశ్నా పత్రం లోని రెండు పేరాలలో ఏదైనా ఒక చదవమని కోరాలి.
🌼పేరాను మూడు కంటే తక్కువ తప్పులతో చదివితే ఆ విద్యార్థి పేరా స్థాయి ( స్థాయి - 4) లో ఉన్నట్లుగా గుర్తించాలి.
🌼 అప్పుడు ఆ విద్యార్థిని కథ చదవమని కోరాలి. కథను మూడు కంటే తక్కువ తప్పులతో చదివితే ఆ విద్యార్థి *కథా స్థాయి ( స్థాయి - 5) లో ఉన్నట్లుగా గుర్తించాలి.
🌼పేరాను మూడు కంటే ఎక్కువ తప్పులతో చదివిన విద్యార్థులను ప్రశ్నా పత్రం లోని ఏవైనా ఐదు పదాలను చదవమని కోరాలి.
🌼ఐదు పదాలలో కనీసం నాలుగు పదాలు స్పష్టంగా చదవగలిగిన విద్యార్థిని *పదాల స్థాయి ( స్థాయి - 3) లో ఉన్నట్లు గుర్తించాలి.
🌼ఐదు పదాలలో నాలుగు పదాలు సరిగ్గా చదవక పొతే ఆ విద్యార్థిని ప్రశ్నా పత్రం నుంచి ఏవైనా ఐదు అక్షరాలు చదవమని కోరాలి.
🌼ఐదు అక్షరాలలో కనీసం నాలుగు అక్షరాలు సరిగ్గా గుర్తించినట్లైతే ఆ విద్యార్థి అక్షరాల స్థాయి ( స్థాయి - 2) లో ఉన్నట్లు గుర్తించాలి.
🌼ఐదు అక్షరాలలో నాలుగు అక్షరాలు గుర్తించకపోతే ఆ విద్యార్థి ప్రారంభ స్థాయి ( స్థాయి - 1 ) లో ఉన్నట్లు గుర్తించాలి.
గణితం
🌼ప్రశ్నా పత్రంలో ఇచ్చిన ఆరు అంకెలలో నాలుగు కంటే తక్కువ అంకెలను విద్యార్థి గుర్తించినట్లయితే ఆ విద్యార్థి ప్రారంభ స్థాయి ( స్థాయి - 1 ) లో ఉన్నట్లు గుర్తించాలి.
🌼ఇచ్చిన ఆరు అంకెలలో నాలుగు కంటే ఎక్కువ అంకెలను గుర్తించిన విద్యార్థిని రెండు అంకెల సంఖ్యలను గుర్తించమని అడగాలి.
🌼ఇచ్చిన రెండు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే తక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థి *ఒక అంకె సంఖ్యల స్థాయి( స్థాయి - 2 ) లో ఉన్నట్లు గుర్తించాలి.
🌼ఇచ్చిన రెండు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే ఎక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థిని మూడు అంకెల సంఖ్యలను గుర్తించామని అడగాలి.
🌼ఇచ్చిన మూడు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే తక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థి *రెండు అంకెల స్థాయి(స్థాయి - 3) లో ఉన్నట్లు గుర్తించాలి.
🌼ఇచ్చిన మూడు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే ఎక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థిని చతుర్విధ ప్రక్రియలోని కూడిక తీసివేత గుణకారం భాగాహారంలకు సంబందించిన ప్రశ్నలు అడగాలి.
🌼చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలను సరిగ్గా చేయని విద్యార్థులను మూడంకెల స్థాయి( స్థాయి - 4) లో ఉన్నట్లు గుర్తించాలి.
🌼చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలను సరిగ్గా చేసిన విద్యార్థులను *గణిత ప్రక్రియల స్థాయి* *(స్థాయి - 5* ) లో ఉన్నట్లు గుర్తించాలి.
ఇంగ్లీష్
🌼ఇచ్చిన ప్రశ్నా పత్రంలోని ఏవైనా ఐదు కాపిటల్ లెటర్స్ ను చదవమని విద్యార్థిని కోరాలి.
🌼ఐదు కాపిటల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదవకపోతే ఆ విద్యార్థి ప్రారంభ స్థాయి ( స్థాయి - 1) లో ఉన్నట్లు గుర్తించాలి.
🌼ఐదు కాపిటల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని ఐదు స్మాల్ లెటర్స్ చదవమని కోరాలి.
🌼ఐదు స్మాల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదవకపోతే ఆ విద్యార్థి *కాపిటల్ లెటర్స్ స్థాయ ( స్థాయి - 2 ) లో ఉన్నట్లు గుర్తించాలి.
🌼ఐదు స్మాల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని ఐదు సులభ పదాలు చదవమని కోరాలి.
🌼ఐదు సులభ పదాలలో నాలుగు పోతే చదవకపొతే ఆ విద్యార్థి స్మాల్ లెటర్స్ స్థాయి (స్థాయి - 3) లో ఉన్నట్లు గుర్తించాలి.
🌼ఐదు సులభ పదాలలో నాలుగు పదాలు చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని నాలుగు సులభ వాక్యాలు చదవమని కోరాలి.
🌼నాలుగు సులభ వాక్యాలలో రెండు వాక్యాలు అర్థవంతంగా చదవని విద్యార్థిని పదాల స్థాయి (స్థాయి - 4) లో ఉన్నట్లు గుర్తించాలి.
🌼నాలుగు సులభ వాక్యాలలో రెండు వాక్యాలు అర్థవంతంగా చదవగలిగిన విద్యార్థి వాక్యాలు స్థాయి (స్థాయి - 5) లో ఉన్నట్లు గుర్తించాలి.
ముఖ్య గమనిక:
👉ఇంగ్లీష్ టూల్ రెండు విభాగాలుగా ఉంటుంది. 1. చదవడం 2. అర్థంచేసుకోవడం
🌼కనుక ఐదు పదాలలో నాలుగు పదాలు చదవగలిగిన విద్యార్థిని ఆ పదాలకు అర్ధాలను వారి వాడుక భాషలో చెప్పమని కోరాలి.
🌼అదేవిధంగా నాలుగు వాక్యాలలో రెండు వాక్యాల యొక్క అర్ధాన్ని వారు మాట్లాడే వాడుక భాషలో చెప్పమని కోరాలి.
🏵️ రాత పరీక్ష కు సంబంధించి అతి ముఖ్య గమనిక
🌼మౌఖిక పరీక్షలలో నాలుగు, ఐదు స్థాయిలలో ఉన్న బాలలకు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి.
విద్యార్థులు స్థాయి నిర్ధారణ ఎలా చేయాలి పూర్తి వివరాలు
0 comments:
Post a Comment