ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా పాఠశాలలను మూసివేయలేదని.. అలా ఎక్కడైనా జరిగితే రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా బాధ్యత వహించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.3, 4, 5 తరగతుల విలీనం తర్వాత ఫౌండేషన్ స్కూల్స్ తీసుకొస్తామని వెల్లడించారు. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొనే జీవో 117కు సవరణ చేసినట్లు చెప్పారు. అలాగే విద్యార్థుల సంఖ్య 21 దాటితే మరో ఎస్జీటీ ఉపాధ్యాయుడిని నియమిస్తామని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితే ప్రధాన ఉపాధ్యాయుడి నియామకం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నదులు, వాగులు, రహదారుల సమస్యలున్న పాఠశాలలపై సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. విదేశీ విద్యకు జగనన్న పేరులో తప్పేంముందని.. అయినా మరోసారి పరిశీలిస్తామని బొత్స స్పష్టం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment