ప్రభుత్వ స్కూల్ హెడ్‌మాస్టార్ ధరించిన డ్రెస్ ఆ జిల్లా కలెక్టర్‌కు నచ్చలేదు. దీంతో కుర్తా, పైజామా ధరించిన ఆ టీచర్‌పై ఆయన మండిపడ్డారు.నువ్వు ఉపాధ్యాయుడివా? లేక రాజకీయ నాయకుడివా?' అంటూ రంకెలు వేశారు. అంతేగాక ఆ హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేయాలని, షాకాజ్ నోటీస్ జారీ చేయడంతోపాటు ఆయన జీతంలో కోత విధించాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. బీజేపీ అధికారంలో ఉన్న బీహార్‌లో ఈ సంఘటన జరిగింది.
లఖిసరాయ్ జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ సింగ్ శనివారం బల్గుదర్‌లోని బాలికల ప్రాథమిక పాఠశాలను సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కుర్తా, పైజామా ధరించిన ప్రధానోపాధ్యాయుడు నిర్భయ్ కుమార్ సింగ్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్‌మాస్టార్ వేసుకున్న డ్రెస్ తీరు నచ్చని కలెక్టర్, 'నువ్వు టీచర్‌గా కనిపించడం లేదు. రాజకీయ నేతగా కనిపిస్తున్నావు' అంటూ చీవాట్లు పెట్టారు. స్కూల్ నిర్వాహణ తీరుపై మండిపడ్డారు. ఆ హెడ్‌మాస్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యా శాఖ అధికారిని ఆదేశించారు. అలాగే ఆయన జీతంలో కోత వేయడంతోపాటు షో కాజ్ నోటీస్ జారీ చేయాలన్నారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుర్తా, పైజామా ధరించినందుకు స్కూల్ హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించడాన్ని పలువురు తప్పుపట్టారు. 'టీచర్ కుర్తా, పైజామా ధరించడం భారతదేశంలో నేరమా? అని ఒకరు ప్రశ్నించారు. 'కేవలం 'కుర్తా, పైజామా' ధరించినందుకు సస్పెండ్ చేసి, షో కాజ్ నోటీసు ఇచ్చి, 'జీతం కట్' చేయమంటూ ఆర్డర్ చేస్తున్నారు. ఈ ఇంగ్లీషు కలెక్టర్ బాబు తీరు ఆమోదయోగ్యమేనా?' అంటూ నెటిజన్లు నిలదీశారు.
0 comments:
Post a Comment