అస్తవ్యస్తమైన జీవన సరళి, తీరుతెన్నూ లేని ఆహారపు అలవాట్లు, వ్యసనాలు గుండెకు సమస్యల తాకిడి పెంచుతోంది.మానసిక ఒత్తిడి కూడా పెను ఇబ్బందిగా మారుతోంది. గుండెపోటుకు గల కారణాలు, వాటిని అధిగమించే మార్గాలను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు హరిరామ్ వివరించారు.
ఎరికైనా గుండెపోటు రావొచ్చు
వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది. వృద్ధులకే గుండెపోటు వస్తుందని అనుకునేవారు..ఇప్పుడు యువకులను కూడా వదలడం లేదు. వాతావరణంలోని మార్పులు, ఆహారపు అలవాట్లతో గుండె పనితీరు మారిపోతోంది. వ్యాయామం లేకపోవడంతో మరీ సమస్యగా తయారవుతోంది. రక్తనాళాలు సరిగా లేకపోయినా, నాళాల్లో బ్లాకులు ఏర్పడినా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
ఎవరికి వస్తుందో తెలుసా
అధిక రక్తపోటు ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. మధుమేహం ఉండటం, చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే కూడా సమస్యగా మారుతుంది. మద్యం, పొగతాగే వాళ్లకు గుండె పనితీరు మందగిస్తుంంది. ఊబకాయం, వ్యాయామం చేయకపోవడంతో పాటు వంశపారంపర్యంగా కూడా గుండె జబ్బులు వస్తాయి.
ఛాతీలో నొప్పి అనిపిస్తే..
గుండెలో నొప్పిగా అనిపించినప్పుడు చెమటలు అధికంగా పడుతాయి. ఆయాసం వస్తుంది. గ్యాస్ సమస్యగా అనిపించినప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గకపోయినపుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడే ఉన్న వారికి సీపీఆర్ చేయడం తెలిస్తే చేయాలి.
0 comments:
Post a Comment