కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడంపై ప్రజల్లో మరింత అవగాహన పెరిగింది.కానీ, నేటికీ దేశంలో చాలా మందికి ఆరోగ్య బీమా లేదు. అయితే, దేశంలో బలహీన ఆదాయ వర్గాలకు ఆరోగ్య సదుపాయాలను అందించడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు ఆయుష్మాన్ భారత్ యోజన. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రజలకు ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డును అందజేస్తుంది. దీంతో ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. మీరు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, ముందుగా దాని అర్హత (Ayushman Bharat Golden Card Eligibility), ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకుందాం..
ఆరోగ్య ఖర్చులు భరించలేని పేదవారి కోసం ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందుబాటులో ఉంది. ఇందుకోసం ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇది ఆరోగ్య కార్డు, దీని ద్వారా పేద ప్రజలు ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో 5 లక్షల ఉచిత చికిత్స పొందవచ్చు.
ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ ఎలా పొందాలంటే..
- ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ పొందడానికి సమీపంలోని పబ్లిక్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలి.
- అక్కడ అధికారి మీ పేరు లిస్టులో ఉందో లేదో చెక్ చేస్తారు.
- మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉంటే, మీ ఆధార్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ ఫోటోకాపీని సమర్పించాలి.
- దీని తర్వాత మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను కూడా సమర్పించాలి.
- మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఇస్తారు.
- ఆ తర్వాత మీరు 15 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.
- 15 రోజుల తర్వాత మీ ఇంటి చిరునామాకు ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ వస్తుంది.
- ఆ తర్వాత మీరు ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఏ ఆసుపత్రిలోనైనా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను పొందవచ్చు.
- ఈ కార్డు ద్వారా దేశంలోని బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్య సౌకర్యాలు చేరవేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
0 comments:
Post a Comment