ఏపీ ప్రభుత్వం(Andhra Pradesh Government) పాఠశాలల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఉన్న 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్ గా(High School Plus) అప్ గ్రేడ్( Upgrade) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఆదేశాల్లో ప్రత్యేకంగా బాలికలకు ఈ పాఠశాలలను కేటాయిస్తున్నట్లు పేర్కొంది. అప్ గ్రేడ్ అయిన ఈ హైస్కూల్ ప్లస్ పాఠశాలలో
ఎంపీసీ(MPC), బైపీసీ(BiPC), సీఈసీ(CEC) వంటి వాటిల్లో స్థానికంగా డిమాండ్ ఉన్న ఏవైనా రెండు కోర్సులను మాత్రమే అందించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఆ డిమాండును అనుసరించి కోర్సులు నిర్ధారించాలని నిర్ణయించింది. వీటిలో బోధనకు PGT సమాన స్థాయి అధ్యాపకులను తీసుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం 1752 స్కూల్ అసిస్టెంట్లను అప్ గ్రేడ్ అయిన ఈ 292 కళాశాలలో పనిచేసేందుకు నియమిస్తామని వెల్లడించారు.
ఇక పాఠశాలలో ప్రస్తుతం అమలవుతున్న నాడు నేడు పనులను దృష్టిలో పెట్టుకొని అదనపు తరగతి గదులను మంజూరు చేయడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నాడు-నేడు రెండో దశలో భాగంగా 12 వేల పైచిలుకు పాఠశాలల్లో పనులు చేపట్టనున్నారు.
పాఠశాలల్లో గతానికి ఇప్పటికీ స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. ఈ పనులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎటువంటి సమస్యలు ఎదురైనా, వాటిని వెంటనే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.
ఆంగ్ల మాధ్యమం, పాఠశాలల విలీనం విషయంలో తగ్గేదేలే..
ఇదిలా ఉండగా.. ప్రతీ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాలన్ని అమలు చేయాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆంగ్ల మాధ్యమం, పాఠశాలల విలీనం విషయంలో తాము వెనకడుగు వేసేదే లేదు అన్నారు. ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి సహకారం అందించాలన్నారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించిన జోఓ 117లో కొన్ని సంవరణలు ఎమ్మెల్సీ, వివిధ సంఘాల ప్రతినిధులు సూచించారని వాటిని పరిశీలిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. బదిలీల విషయం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఎంఈఓలకు బదిలీలు లేవని.. పంచాయతీ ఆధారంగానే బదిలీలు ఉంటాయన్నారు. పాఠశాలల ఆధారంగా ఈ బదిలీలు ఉండవని మంత్రి తెలిపారు.
0 comments:
Post a Comment