జూలై 22 న విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ ఎలా నిర్వహించాలి?
విద్యార్థుల స్థాయి నిర్ధారణ ఎలా చేయాలి ?
ప్రారంభ పరీక్ష - సూచనలు
* రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో 2 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న బాలలందరికీ 2022–23 విద్యాసంవత్సరానికిగాను ప్రారంభ పరీక్షను నిర్వహించాలి. • తెలుగు, ఇంగ్లీషు, గణితంలలో ప్రారంభ పరీక్ష ఉంటుంది.
+ ఫౌండేషన్ పాఠశాలలో 2నుండి 5వ తరగతి వరకు, ఉన్నత పాఠశాలలో 6నుండి 10వ తరగతి చదువుతున్న బాలలందరికీ ప్రారంభ పరీక్ష నిర్వహించాలి. • ప్రారంభ పరీక్ష 2 రకాలుగా ఉంటుంది. మొదటిది మౌఖిక పరీక్ష రెండవది రాతపరీక్ష,
* రెండు నుండి పదవ తరగతి వరకు ఒకే రకమైన ప్రశ్నపత్రం ద్వారా తెలుగు, ఇంగ్లీషు, గణితంలలో మౌఖిక పరీక్ష నిర్వహించబడుతుంది. * ప్రతి పాఠశాలకు మౌఖిక పరీక్ష కోసం రెండు శాంపిల్స్ ఇవ్వబడతాయి. ఒక్కొక్క విద్యార్థికి వేరువేరు శాంపిల్స్ ఉపయోగించి మౌఖిక పరీక్ష జరపాలి.
• ప్రతి శాంపిల్లో ఐదు స్థాయిలు ఉంటాయి. విద్యార్థి చదవగలిగిన విధానాన్ని బట్టి అతడు/ఆమె ఏ స్థాయిలో(ప్రారంభస్థాయి అక్షరాలస్థాయి, పదాల స్థాయి, పేరా స్థాయి, కథస్థాయి) గుర్తించాలి. * ఒక్కొక్క విద్యార్ధిని వ్యక్తిగతంగా పిలిచి చదివించి స్థాయిని నిర్ధారణ జరపాలి. ఒక పాఠశాలలో నలుగురు టీచర్లు ఉన్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క శాంపిల్ ఉపయోగించి ఒక తరగతిలోని నలుగురు విద్యార్థులను ఒకేసారి పరిశీలించవచ్చు. పాఠశాలలో ఎక్కువమంది పిల్లలు ఉన్నట్లయితే అందుబాటులో ఉన్న టీచర్లందరినీ మూల్యాంకనంలో ఉపయోగించుకోవాలి.
* మౌఖిక, పరీక్ష నిర్వహించగానే పిల్లల స్థాయి నిర్ధారణను ఆన్లైన్లో నమోదు చేయాలి. * ఒక్కొక్క విద్యార్థిని వ్యక్తిగతంగా పరీక్షించాలి కాబట్టి మొదటి రోజు తెలుగు, రెండోరోజు ఇంగ్లీషు, మూడవరోజు గణితంలో మౌఖిక పరీక్ష నిర్వహించాలి.
0 comments:
Post a Comment