పాఠశాల విద్య పాఠ్యపుస్తకములు (విక్రయ పాఠ్యపుస్తకములు) 2022-23 విద్యా సంవత్సరం - ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలకు సరఫరా పేమెంట్ విధానము పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు జిల్లా విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు / యాజమాన్యాలకు మార్గదర్శకాలు యూజర్ మాన్యువల్ - జారీచేయుట గురించి జిల్లా విద్యాశాఖాధికారులకు మండల విద్యాశాఖాధికారులకు ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలకు మార్గదర్శకాలు గురించి.
ఆర్.సి. నెంబర్ 106/NT Books/2022-1,తేదీ: 09.07.2022
సూచిక : 1 ఆర్ సి నెంబర్ 106/NT Books/2022, తేదీ: 25.06.2022, పాఠశాల విద్యాశాఖ కమీషనర్, ఆంధ్రప్రదేశ్ వారి కార్య వర్తనములు.
ఆదేశములు:
సూచిక 1 అనుసరించి ప్రైవేట్ యాజమా పాఠశాలలు విద్యార్ధులకు అవసరమైన ప్రభుత్వ పాఠ్యపుస్తకాల సరఫరా మరియు పంపిణికి సంబంధించి సమగ్రమైన ఉత్తర్వులు ఇవ్వడమైనది. ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలల లాగిన్ల ద్వారా అవసరమైన పాఠ్య పుస్తకాల కొరకు ఇదివరకే ఇండెంట్ పెట్టడము జరిగినది. తదనుగుణంగా ప్రభుత్వ పాఠ్య పుస్తకాల డైరెక్టర్, 2022-23 సంవత్సరానికి గాను గుర్తింపుపొందిన ప్రింటర్ల ద్వారా పాఠ్య పుస్తకాలను ముద్రించి జిల్లా పాఠ్య పుస్తకాల మేనేజర్ల ద్వారా అన్ని మండల కేంద్రాలకు పాఠ్య పుస్తకాలను పంపిణి చేస్తున్నారు.
ఈ సూచిక ద్వారా ఒక్కొక్క పాఠ్య పుస్తకం విక్రయ ఖరీదు మరియయు తరగతి వారీగా పుస్తకాల సెట్ ఖరీదును కూడా తెలియపరచడం జరిగినది. అదేవిధముగా ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు తమకు అవసరమైన పాఠ్య పుస్తకాలను ఆన్ లైన్ పేమెంట్ ద్వారా చెల్లించి తగు రశీదును పొంది మండల విద్యాశాఖాధికారులను సంప్రదించి పాఠ్య పుస్తకాలు పొందవచ్చని సూచించడమైనది.
ఆన్ లైన్లో పాఠశాలకు అవసరమైన పుస్తకములు కొరకు తగిన సొమ్ము చెల్లించే విధానము మరియు మండల విద్యాశాఖాధికారి ఏ విధంగా పేమెంట్ ప్రక్రియ ని ధృవీకరించుకొనవలెనో మరియు చెల్లించిన సొమ్ముకి అనుగుణంగా పుస్తకాలను ఏ విధంగా పంపిణీ చేయవలెనో ఆయా వివరాలతో కూడిన యూజర్ మాన్యువల్ కూడా దీనికి అనుబంధంగా జత చేయడమైనది.
రాష్ట్రము లోని అందరూ ప్రాంతీయ విద్య సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు జిల్లా పాఠ్య పుస్తకాల మేనేజర్లు మరియు మండల విద్యాశాఖాధికారులు పాఠ్య పుస్తకాల (విక్రయ) పంపిణీకి సంబంధించి గతంలో జారీ చేసిన మార్గదర్శకాలననుసరించి తగు ప్రణాళిక ప్రకారం అమలు చేయవలసిందిగా ఇందు మూలముగా ఆదేశించడమైనది.
0 comments:
Post a Comment