SBI Home Loans | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హౌసింగ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగినాయి

 ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచింది. కరోనా నేపథ్యంలో దాదాపు రెండేళ్ల పాటు వడ్డీ రేట్లు దశాబ్దంన్నర కనిష్టం వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఆర్థిక రికవరీ నేపథ్యంలో కేంద్ర బ్యాంకు ఆర్బీఐ రెపో రేటును గత నెలలో 40 బేసిస్ పాయింట్లు పెంచింది. జూన్ ద్వైపాక్షిక సమావేశంలో మరోసారి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు కూడా పర్సనల్ లోన్ నుండి వెహికిల్ లోన్, హోమ్ లోన్ వరకు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.

ఇందులో భాగంగా ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు(EBLR) హోమ్ లోన్ వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఈబీఎల్ఆర్ ఆధారిత ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు 6.65 శాతం నుండి 7.05 శాతానికి, రెపో ఆధారిత హోమ్ లోన్ వడ్డీ రేటు 6.25 శాతం నుండి 6.65 శాతానికి చేరుకుంది. క్రెడిట్ రిస్క్ ప్రీమియం దీనికి అదనం. బుధవారం నుండి ఈ పెంపు అమల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top