ఇండియాలో డిజిటల్ బ్యాంకింగ్(Digital Banking), మనీ పేమెంట్ యాప్స్(Money Payment Apps) హవా నడుస్తోంది. ఫోన్ పే(Phone Pay), గూగుల్ పే(Google Pay), పేటీఎం(Paytm) వంటి ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు ఈ విభాగంలో మెరుగైన సేవలను అందిస్తున్నాయి.వీటిలో గూగుల్ పే (Google Pay).. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌లలో(Online Payment App) ఒకటిగా మారింది. దీని ద్వారా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, స్థానిక దుకాణాలు లేదా థర్డ్ పార్టీ యాప్స్‌కు(Third Party Apps) డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు. వినియోగదారులు చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌కు(Transactions) ఈ యాప్ రివార్డ్‌లను(Reward) కూడా అందిస్తుంది. ఈ లావాదేవీల వివరాలను యాప్‌లోనే స్టోర్(App Store) చేస్తుంది.అయితే ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీ సమాచారాన్ని యాప్ సేవ్ చేయడం లేదా ట్రాక్ చేయడం కొందరికి నచ్చకపోవచ్చు. అందుకే ఈ డేటాను యాప్ నుంచి పర్మినెంట్‌గా(Perminent) తొలగించాలని కొందరు భావిస్తారు. గూగుల్ పే యాప్‌లో మీ ట్రాన్సాక్షన్ హిస్టరీని శాశ్వతంగా డిలీట్(Delete) చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో(Seps Follow) అవ్వండి.
Google Pay: గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీని శాశ్వతంగా డిలీట్ చేయాలనుకుంటున్నారా..? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
* గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీని పర్మినెంట్‌గా ఎలా డిలీట్ చేయాలి?
స్టెప్ 1- మీ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, "https://www.google.com" వెబ్‌సైట్‌కు వెళ్లండి.
స్టెప్ 2- వెబ్ పేజీలో "Google account" ఓపెన్ చేసి మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.
స్టెప్ 3- ఇప్పుడు వెబ్ పేజీ పైభాగంలో 'Data and Privacy' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4- ఇందులో 'History Settings' విభాగానికి వెళ్లి 'Web and App Activity', ఆ తర్వాత 'Manage All web & app activity' ఆప్షన్స్ ఎంచుకోండి.
స్టెప్ 5- ఇప్పుడు సెర్చ్ బార్‌లో మూడు నిలువు చుక్కలపై నొక్కి, 'Other Google Activity'కి వెళ్లండి.
స్టెప్ 6- Google Pay ఎక్స్‌పీరియన్స్ కింద, "Manage Activity" ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 7- డ్రాప్-డౌన్ మెనూలో 'Delete' ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఏ భాగాన్ని డిలీట్ చేయాలనేది ఎంచుకోవచ్చు.
ఈ లిస్ట్‌లో కొన్ని ఆప్షన్లు ఉంటాయి. వీటిని ఎంచుకొని చివరి గంట, చివరి రోజు, ఇతర టైమ్ డ్యూరేషన్‌కు సంబంధించిన డేటాను పర్మినెంట్‌గా డిలీట్ చేయవచ్చు. "ఆల్ టైమ్" ఆప్షన్‌ను ఎంచుకుంటే, డేటా మొత్తాన్ని డిలీట్ చేయవచ్చు. నిర్దిష్ట కాలవ్యవధికి కూడా ఈ ట్రాన్సాక్షన్ వివరాలు డిలీట్ చేయవచ్చు. అయితే ట్రాన్సాక్షన్ హిస్టరీలో అప్‌డేట్ కనిపించడానికి గరిష్టంగా 12 గంటల సమయం పడుతుంది. కస్టమర్ల డేటాను గూగుల్ ఎవరికీ విక్రయించదని, యాడ్స్ అందించేందుకు ట్రాన్సాక్షన్ హిస్టరీని ఇతర గూగుల్ ప్రొడక్ట్స్‌కు అందించదని కంపెనీ చెబుతోంది.
0 comments:
Post a Comment