ప్రతి ఒక్కరి జీవితంలో ప్రస్తుతం ఆధార్ కార్డు అనేది ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం భారత దేశంలో ఉన్నట్లుగా ఒక పౌరుడిగా గుర్తింపు ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాల్సిందేఒక దేశం ఒకే కార్డు అనే నినాదంతో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆధార్ కార్డును ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కలిగి ఉంటున్నారు. ఇలా ఆధార్ కార్డు కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేశంలో ఉన్నట్టు గుర్తింపు. ప్రభుత్వం నుంచి అంది అన్ని రకాల పథకాలు కూడా వర్తిస్తాయి అని చెప్పాలి.
ఇటీవలి కాలంలో అటు పిల్లలకు బాల ఆధార్ కార్డు నమోదు చేయడం లేదా ఆధార్ కార్డులో ఉన్న తప్పులను సరి చేయడం కోసం ప్రజలు ఆధార్ కార్డ్ సెంటర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే అటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఆధార్ కార్డు సర్వీసులను మరింత సరళతరం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే తెలంగాణ ప్రజలందరికీ కూడా పోస్టల్ శాఖ శుభ వార్త చెప్పింది. బాల ఆధార్ కార్డు గురించి ఇక ఎవరు ఎక్కడికి వెళ్లాలి అవసరం లేదని.. ఇంటి వద్దే ఆధార్ కార్డు నమోదు చేయబోతున్నట్లు తెలిపింది.
ఐదేళ్ల లోపు పిల్లల ఆధార్ కార్డు వివరాలను ఇంటి వద్దకే వచ్చి ఉచితంగా నమోదు చేసేందుకు నిర్ణయించింది పోస్టల్ శాఖ. పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఫోటో, బయోమెట్రిక్ వివరాలను తమ ఇంటి వద్దకు వచ్చిన పోస్ట్ మ్యాన్ కు ఇక పిల్లల తల్లిదండ్రులు అందజేయాల్సి ఉంటుంది. కాగా తెలంగాణలో 1552 మంది డాక్ సేవక్ లు, పోస్ట్ మాన్ లు ఆధార్ నమోదు సేవలో పాల్గొనబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల్లో ఉండే అంగన్వాడీ కార్యకర్తలు సహాయంతో ఇక ఈ ఆధార్ కార్డు నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు..
0 comments:
Post a Comment