రోజురోజుకీ పెగిపోతున్న టెక్నాలజీ మానవునికి అవసరమైనన్ని రెడీ మేడ్ పరికరాలు అందించి, వారి విలువైన సమయాన్ని సేవ్ చేస్తోంది. ఈ క్రమంలో హోమ్ అప్లయెన్సస్ విభాగంలో కూడా అనేక ఆవిష్కరణలు వెలువడుతున్నాయి.అవి మనుషులకు ఎన్నో రకాలుగా ఉపకరిస్తున్నాయి. ఇకపోతే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో అంతర్జాతీయంగా మంచి పేరు ఉన్నటువంటి వాటిలో 'Haier' కంపెనీ ఒకటి. తాజాగా ఈ సంస్థ మొట్టమొదటి స్మార్ట్ వాక్యూమ్ క్లీనర్ టెక్నాలజీ 2ఇన్1 డ్రై అండ్ వెట్ మాప్ రోబో వాక్యూమ్ క్లీనర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. క్లీనింగ్‌ను మరింత అనుకూలంగా వినియోగదారులకు మలచడంలో ఈ రోబో కీలక పాత్ర పోషిస్తోంది.
గుగూల్ హోమ్ అసిస్ట్ మరియు 2.4 గిగా హెర్ట్జ్ వైఫైతో కూడిన పూర్తి సరికొత్త హైయెర్ రోబో వాక్యూమ్ క్లీనర్, హైయెర్ స్మార్ట్ యాప్, వాయిస్ కంట్రోల్ మరియు రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. హైయెర్ రోబో వాక్యూమ్ క్లీనర్‌ను ప్రపంచంలో ఎక్కడైనా అతి సౌకర్యవంతంగా యూస్ చేయొచ్చు. అంతేకాకుండా ఇది ఫ్లోర్ పాడవకుండా, గీతలు పడకుండా కాపాడుతుంది. దీనిలోని 2200pa అల్ట్రా స్ట్రాంగ్ సక్షన్ పవర్, ప్రాక్సిమిటి సెన్సార్లు దీనికి దోహదపడతాయి.
దీనివలన ఉపయోగాలు: 1. ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ చాలా సైలెంట్ గా పనిచేస్తుంది. సన్నటి డిజైన్, 76MM ఎత్తు కలిగిన ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ అంతంత సులువుగా ఫర్నిచర్ కిందకు కూడా వెళ్లి, లోపల శుభ్రపరుస్తుంది.
2. మెట్లపై పడిపోకుండా ఎంతో చాకచక్యంగా ఇది శుభ్రం చేస్తుంది. దీనిలో క్లిఫ్ సెన్సార్ ఉంది. ఇది ఎత్తు నుంచి పడిపోకుండా కాపాడుతుంది. మెట్లలాంటి ఎత్తు పల్లాలను ఇది గుర్తిస్తే, ఆటోమేటిక్‌గా ఆ సెన్సార్ ఆన్ కావడంతో పాటు అంచులు శుభ్రపరిచి తప్పుకుంటుంది.3. స్పాట్ క్లీన్- హైయెర్ స్మార్ట్ యాప్‌లో స్పాట్ క్లీన్ ఎంచుకోవడం ద్వారా హైయెర్ రోబో వాక్యూమ్ క్లీనర్ ఆ నిర్ధిష్టమైన ప్రాంతాన్ని మాత్రమే శుభ్రపరుస్తుంది. ఇది నిజంగా అద్భుతమైన ఫీచర్.
4. దీనిలో వున్న ఒక ముఖ్యమైన ఫీచర్ ఏమంటే, ఆటోమేటిక్ సెల్ఫ్ చార్జింగ్. అవును.. రోబో వాక్యూమ్ క్లీనర్, బ్యాటరీ స్థాయి తగ్గితే దానంతట అదే చార్జింగ్ స్టేషన్‌కు వెళ్లి ఛార్జ్ చేయమని అడుగుతుంది.
0 comments:
Post a Comment