» డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికీ ప్రతిపాదన
» హెచ్ఎంల సంఘానికి విద్యాశాఖ కమిషనర్ హామీ
రాష్ట్రంలో ప్రతి పాఠ శాలలో బోధనేతర విధుల కోసం ఒక వాచ్మన్, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ను నియమించేందుకు ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపిస్తామని విద్యాశాఖ కమిషనర్ సురేశ్కుమార్ హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రయ త్నిస్తామన్నారు. కొత్తగా విలీనం కోసం మ్యాపింగ్ చేసే పాఠ శాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల సంఖ్యను రేషనలైజ్ చేస్తామని చెప్పారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ వివాదం ఈనెల 22న న్యాయస్థానంలో వస్తుందని, కోర్టు ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం కలెక్టరేట్ల ముందు ధర్నాలకు పిలుపునివ్వడంతో విద్యాశాఖ చర్చలకు పిలిచింది. గురు వారం చర్చల్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. చర్చల్లో విద్యా శాఖ కమిషనర్ సానుకూలంగా స్పందించడంతో ధర్నాలు విరమించుకున్నట్లు నారాయణరెడ్డి తెలిపారు.
0 comments:
Post a Comment