ఎడ్యుకేషన్ లోన్ ఎన్ని రకాలు..? ఎడ్యుకేషన్ లోన్ పొందే విధానం

Education Loan:చాలా మంది విద్యార్థులు ఖర్చులకి భయపడి ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి ఖర్చు నిరంతరం పెరుగుతోంది. దీంతో కొంతమందిEducation Loan:చాలా మంది విద్యార్థులు ఖర్చులకి భయపడి ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి ఖర్చు నిరంతరం పెరుగుతోంది. దీంతో కొంతమంది మధ్యలోనే చదవుని వదిలేస్తున్నారు. అయితే ఇక్కడే వారు తెలివిగా ప్రవర్తిస్తే ఒక ఉపాయం ఉంది. ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదువుకునే అవకాశం ఉంటుంది. మీ కలలని నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలామందికి విద్యారుణంపై అవగాహన లేదు. దీనిని ఎలా పొందాలి. ఏయే పత్రాలు అవసరమవుతాయి.. తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

ఎడ్యుకేషన్‌లోన్‌ 12వ తరగతి తర్వాత చదివే ఉన్నత చదువులకి తీసుకోవచ్చు. ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు మొదలైన ఖర్చుల కోసం ఈ రుణాలని మంజూరుచేస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు విద్యా రుణాలు ఇస్తాయి. ప్రభుత్వ బ్యాంకులు సాధారణంగా ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీతో విద్యారుణాలని ఆఫర్ చేస్తాయి. ఒక విద్యార్థి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా లాంటి కోర్సులు చదవడానికి ఎడ్యుకేషన్‌లోన్‌ తీసుకోవచ్చు. దీనికి భారతదేశ పౌరుడై ఉండాలి. ఆదాయపు పన్ను సెక్షన్ 80E కింద విద్యా రుణ వడ్డీ చెల్లింపుపై మినహాయింపు పొందుతారు

ఎడ్యుకేషన్ లోన్ ఎన్ని రకాలు..?

అండర్ గ్రాడ్యుయేట్ లోన్: ఈ లోన్ ఏదైనా గ్రాడ్యుయేషన్ కోర్సు కోసం తీసుకోవచ్చు. దరఖాస్తుదారు తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత దేశంలో లేదా విదేశాలలో చదువుల కోసం ఈ రుణాన్ని తీసుకోవచ్చు.

కెరీర్ ఎడ్యుకేషన్ లోన్: ఏదైనా కెరీర్ ఓరియెంటెడ్ కోర్సు కోసం తీసుకోవచ్చు. ప్రభుత్వ కళాశాల లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి చదువుకోవడానికి కెరీర్ ఎడ్యుకేషన్ లోన్ అందుబాటులో ఉంటుంది.

ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ లోన్: బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) లేదా PG డిప్లొమా లేదా ఇతర ఉన్నత విద్యా కార్యక్రమాల కోసం ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ లోన్ తీసుకోవచ్చు.

తల్లిదండ్రుల రుణం: తమ పిల్లలను చదివించలేని తల్లిదండ్రులు బ్యాంకు నుంచి పేరెంట్ లోన్ తీసుకోవచ్చు.

ఎడ్యుకేషన్ లోన్ కోసం కావాల్సిన పత్రాలు..

వయస్సు రుజువు, పాస్పోర్ట్ సైజు ఫోటో, పాఠశాల, కళాశాల లేదా విశ్వవిద్యాలయ మార్కుషీట్, ఐడీ రుజువు, చిరునామా రుజువు, కోర్సు గురించి పూర్తి వివరాలు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, తల్లిదండ్రుల ఆదాయ రుజువు, బ్యాంక్ పాస్‌బుక్ అవసరమవుతాయి.

విద్యా రుణం తీసుకోవడం సరైనదేనా?

ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి రుణాలు తీసుకుంటారు. ఎలాంటి రుణం తీసుకున్నా అది మంచిది కాదు. మీరు రుణం తీసుకున్నప్పుడు వడ్డీని చెల్లించాలి. అందుకే మీ అవసరాన్ని బట్టి రుణం తీసుకోండి. మీరు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే మీకు మంచి క్రెడిట్ స్కోర్ వస్తుంది. దీని తర్వాత మళ్లీ రుణం తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top