AUEET- 2022 Exam Date: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University).. బీటెక్ + ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ (ఇంజినీరింగ్) కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ (AUEET- 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది.నోటిఫికేషన్‌కు సంబంధించి ముఖ్యమైన సమాచారం మీకోసం..
వివరాలు:
పరీక్ష: ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్-2022
కోర్సులు: బీటెక్ + ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాములు
విభాగాలు: సీఎస్ఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ కలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
కోర్సుల వారీగా సీట్ల సంఖ్య:
బీటెక్ + ఎంటెక్ (సీఎస్‌ఈ): 360
బీటెక్ + ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్): 60
బీటెక్ + ఎంటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్): 30
బీటెక్ + ఎంటెక్ (ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్): 30
అర్హతలు: ఇంటర్మీడియట్ (10+2)లో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో, కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్ నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప.
దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్ధులకు: రూ.1200
ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్ధులకు: రూ.1000
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విధ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేది: జూన్ 22, 2022.
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: జూన్ 28, 2022.
AUEET 2022 ప్రవేశ పరీక్ష తేదీ: జూన్ 30, 2022.
AUEET 2022 ఫలితాల ప్రకటన తేదీ: జులై 2, 2022.
ప్రవేశాలు ప్రారంభ తేదీ: జులై 8, 2022.
0 comments:
Post a Comment