SBI Loan | కస్టమర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంకుకు వెళ్లకుండా ఎనిమిది లక్షలు పర్సనల్ లోన్ పొందే అవకాశం

SBI Loan | కస్టమర్లు బ్యాంకుకు రావాల్సిన అవసరం లేకుండానే పర్సనల్ లోన్ ఇస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). కస్టమర్లు రూ.8,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్‌కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.


SBI Loan | కస్టమర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంకుకు వెళ్లకుండా ఎనిమిది లక్షలు పర్సనల్ లోన్ పొందే అవకాశం

1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు శుభవార్త. ఎస్‌బీఐ మరోసారి ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ ప్రకటించింది. యోనో ఎస్‌బీఐ (Yono SBI) యాప్ ద్వారా ఇన్‌స్టంట్‌గా పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తోంది. ఎస్‌బీఐ కస్టమర్లు ఇంటి నుంచే పర్సనల్ లోన్‌కు అప్లై చేయొచ్చు. వెంటనే లోన్ మంజూరవుతుంది. లోన్ డబ్బులు అకౌంట్‌లో జమ అవుతాయి

2. గతంలో కూడా యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ ఇచ్చింది ఎస్‌బీఐ. ఇప్పుడు మరోసారి ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్‌బీఐ కస్టమర్లు ఎవరైనా సులువుగా రుణాలు పొందొచ్చు. అయితే తమకు లోన్ ఎంత మంజూరైందో కస్టమర్లు తెలుసుకోవాల్సి ఉంటుంది.

3. ఎస్‌బీఐ కస్టమర్లు తమకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఎంత మంజూరైందో తెలుసుకోవడానికి తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ నెంబర్‌లోని చివరి 4 అంకెలు టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు మీ అకౌంట్ నెంబర్ చివర్లో 1234 అని ఉంటే PAPL 1234 అని టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. 

4. ఎస్‌బీఐ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఎంత మంజూరైందో ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం రూ.8,00,000 వరకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఇస్తోంది ఎస్‌బీఐ. అయితే కస్టమర్ల ప్రొఫైల్, ఉద్యోగం, ఆదాయం, క్రెడిట్ హిస్టరీ, తిరిగి చెల్లించే సామర్థ్యం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని లోన్ మొత్తాన్ని నిర్ణయిస్తుంది ఎస్‌బీఐ

5. మీకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ మంజూరైనట్టైతే యోనో ఎస్‌బీఐ యాప్‌లో ఈజీగా రుణం పొందొచ్చు. ఇందుకోసం ముందుగా యోనో యాప్ డౌన్‌లోడ్ చేయాలి. మీ వివరాలతో ముందుగా రిజిస్టర్ చేయాలి. గతంలోనే రిజిస్టర్ చేసినవారు లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత PAPL బ్యానర్ పైన క్లిక్ చేయాలి. 

6. ఆ తర్వాత మీరు ఎంత లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. టెన్యూర్ ఎంచుకోవాలి. సబ్మిట్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీ అకౌంట్‌లో లోన్ డబ్బులు జమ అవుతాయి. మీరు సూచించిన తేదీలో ప్రతీ నెలా ఈఎంఐ మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది.

7. ఎస్‌బీఐ నుంచి ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ పొందేందుకు కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు ఫీజు, డాక్యుమెంటేషన్ కూడా ఉండదు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top