ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్లను నేరుగా పొందవచ్చు.ఈ నెల 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. పరీక్ష హాల్‌టిక్కెట్లను పబ్లిక్ డొమైన్‌లో ఉంచామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థులు స్వయంగా నెట్‌సెంటర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. మొదటి ఏడాది విద్యార్థులు వారి హాల్‌టిక్కెట్ నెంబరు, టెన్త్ హాల్‌టిక్కెట్ నెంబరు, ఆధార్ నెంబర్లలో ఏదో ఒకటి ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని వివరించారు.
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వారి హాల్‌టిక్కెట్ నెంబరు గానీ, ఆధార్ నెంబరు గానీ ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. వీటిపై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని వెల్లడించారు. హాల్‌టిక్కెట్లలో విద్యార్థుల ఫొటోలు, సంతకాల్లో సవరణ అవసరమైనప్పుడు మాత్రమే విద్యార్థులు సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించి సరిచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు బోర్డు వెబ్‌సైట్ ద్వారా హాల్‌టిక్కెట్లు పొందవచ్చన్నారు.
0 comments:
Post a Comment