ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులను ప్రభావితం చేసేది అధిక రక్త పోటు, దీన్నే బీపీ (Blood Pressure) అని సాధారణంగా అంటుంటాం. కానీ బీపీని సరైన సమయంలో గుర్తించి నియంత్రించకపోతే ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న వయోజన జనాభాలో 30 శాతం కంటే ఎక్కువ మందిని అధిక రక్తపోటుతో ప్రభావితం అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు బీపీ బారిన పడుతున్నారు.
ఇండియా కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ యొక్క తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలోని ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. హై బీపీ వల్ల హృదయ సంబంధ వ్యాధులకు, ముఖ్యంగా కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్‌లకు ప్రధాన కారకంగా మారుతోంది, అలాగే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, గుండె వైఫల్యం, అరిథ్మియా వంటి వ్యాధులకు కూడా హై బీపీ కారణం అవుతోంది.
“హైపర్‌టెన్షన్ కొన్నిసార్లు హెచ్చరిక లేకుండానే వస్తుంది, ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అధిక రక్తపోటు అనేది ఒక సాధారణ విషయంగా చాలా మంది తరచుగా కొట్టివేస్తుంటారు. కానీ శరీరంలో ముఖ్యమైన అవయవాలను దెబ్బతీసే వరకు ప్రజలు ఆ సమస్యను గుర్తించడంలో విఫలమవుతున్నారని, నిపుణులు పేర్కొంటున్నారు.
రక్తపోటు వల్ల మెదడు, గుండె, మూత్రపిండాల వంటి ప్రధాన అవయవాలను ప్రభావితం చేస్తుంది. అకాల మరణాలకు ప్రధాన కారణం అవుతుంది. అధిక రక్తపోటును సాధారణ మందులతో నయం చేయవచ్చు, అయితే చాలా మంది ప్రజలు తగ్గిందని భావించి రక్తపోటు మందులను నిలిపివేస్తుంటారు. ఇది వారికి ప్రమాదకరంగా మారవచ్చు.
బీపీ వల్ల, కేవలం గుండె మూత్రపిండాల సమస్యలు మాత్రమే కాదు, మీ కంటి చూపును ప్రభావితం చేస్తుంది. కంటి వ్యాధికి కూడా దారి తీస్తుంది. “హైపర్‌టెన్షన్ రెటీనాలోని రక్తనాళాలకు హాని కలిగిస్తుంది. ఈ వ్యాధిని హైపర్‌టెన్సివ్ రెటినోపతి అంటారు.
హైపర్‌టెన్షన్ సాధారణంగా పెద్దలను ప్రభావితం చేస్తున్నప్పటికీ, ఇది ఇప్పుడు పిల్లలు మరియు యుక్తవయస్కులను కూడా ప్రభావితం చేయడం ప్రారంభించింది. ఇది పిల్లలలో హృదయ సంబంధ సమస్యలను కలిగిస్తుంది.
“తేలికపాటి రక్తపోటుతో బాధపడుతున్న పిల్లలు ఎటువంటి లక్షణాలను చూపించకపోవచ్చు, అయితే తీవ్రమైన రక్తపోటుకు సంబంధించిన లక్షణాలు తలనొప్పి, వికారం, వాంతులు, అస్పష్టమైన దృష్టి,వేగవంతమైన హృదయ స్పందన వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలలో అధిక రక్తపోటు స్థాయిలు కొన్నిసార్లు ఫిట్స్, స్పృహలో మార్పు, శ్వాస ఆడకపోవడం లేదా వేగంగా శ్వాస తీసుకోవడానికి కూడా దారితీయవచ్చు.
బీపీ అనేది జీవనశైలి వ్యాధి అయినప్పటికీ, దీనిని నియంత్రించవచ్చని నిపుణులు తెలిపారు. సరైన బరువును నిర్వహించడం. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కాయధాన్యాలు, బీన్స్‌తో సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం, రక్తపోటు మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఉప్పు అనేది చాలా ప్రమాదకరం. సాధారణ వ్యక్తులు కూడా ఉప్పును ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ వ్యాధి వస్తుంది. అలాగే ధూమపానం, మద్యపానం తీసుకోవడం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. సరైన శారీరక శ్రమతో పాటు రక్తపోటు సంబంధిత సమస్యలను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడం అత్యంత ఆవశ్యకం.
0 comments:
Post a Comment