Green Tea | గ్రీన్ టీ ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుకోవచ్చు



గ్రీన్ టీ.. అద్భుతమైన పానీయాల్లో ఒకటి. ఇతర టీలతో పోల్చితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఫైటో కెమికల్స్, ఫైటో ఫినాల్స్, అమైనో యాసిడ్లు, ఫాలిఫినాల్స్ వంటివి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.అంతేకాదు గ్రీన్ టీ బరువును తగ్గించడంతోపాటు మెదడును చురుగ్గా ఉంచడం వరకూ ఎన్నో ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.

గ్రీన్ టీని కేవలం ఆరోగ్యం కోసమే కాదు.. అందానికి కూడా ఉపయోగించవచ్చు. మీ చర్మం మరింత మెరిసిపోవడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుంది. ఇంట్లోనే గ్రీన్ టీతో మీ చర్మం మెరిసిపోయేలా ప్యాక్ తయారు చేసుకోవడమెలాగో తెలుసుకోండి.

వారానికోసారి:

గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్లు అధికమోతాదులో ఉంటాయి. ఇవి కళ్ల కింద ముడతలు తగ్గించడంతోపాటు కళ్ల కింద నల్లని వలయాలు మటుమాయం చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ K కళ్ల కింద లావుగా ఉన్న భాగాన్ని తిరిగి సాధారణ స్థితికి వచ్చేలా చేస్తుంది. గ్రీన్ టీ బ్యాగులను ఫ్రిజ్ లో గంటపాటు ఉంచి ఆ తర్వాత దాన్ని మీ కళ్లపై అరగంటపాటు ఉంచుకోవాలి. వారానికొకసారి ఇలా చేసినట్లయితే మీ కళ్లు మెరుస్తాయి.

మెరిసే చర్మం కోసం:

ఏ కాలంలో అయినా చర్మం మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు. దీని కోసం మీరు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. గ్రీన్ టీతో ముఖం కడుక్కుంటే చాలు. ఇది మీ చర్మంలోని మలినాలను తొలగించి చర్మ రంధ్రాలను శుభ్రం చేయడంలో.. ఒక మంచి టోనర్ గా పని చేస్తుంది.

గ్రీన్ టీ చర్మానికి అప్లై చేస్తే…ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి:

* ఇది చర్మ క్యాన్సర్ ను రాకుండా అడ్డుకుంటుంది.

* పింపుల్స్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

* మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

* అల్ట్రా-వయలెట్ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

గ్రీన్ టీ, పెరుగు ప్యాక్:

ఈప్యాక్ ఎలా తయారు చేయాలంటే.. గ్రీన్ టీని ఒక స్పూన్ తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేయాలి. సరిగ్గా ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడగండి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

చర్మం కాంతివంతంగా:

గ్రీన్ టీ మీ స్కిన్ గ్లోను కచ్చితంగా పెంచుతుందనే చెప్పవచ్చు. అంతేకాదు మీ ఫేస్ పై ఉండే నల్లమచ్చలు, పింపుల్స్ ను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడంతో పాటు కొన్ని టీ ఆకులను మెత్తని పేస్టులా తయారు చేసుకుని, అందులో కాస్త తేనే, నిమ్మరసం కలిపి, ఈ ప్యాక్ ని సుమారు 15 నిమిషాల పాటు ఉంచుకుని ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.

హెయిర్ కేర్:

గ్రీన్ టీతో మీ హెయిర్ చాలా బలంగా తయారవుతుంది. ఇందులో ఉండే ఫాలీఫినాల్స్ అల్ఫా రిడక్టేజ్ గుణాలు మీ కురులు రాలడాన్ని తగ్గిస్తుంది. అందుకే ప్రతిరోజూ గ్రీన్ టీ రోజూ తాగడంతో పాటు నెలకు ఒకసారి తలకు పట్టించండి. ఇలా చేయడం వల్ల మీ శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top