ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చిందిBIG SAVING DAYS SALE ను ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, కూలర్లు, ఫ్యాన్లు, స్మార్ట్ వాచ్ లు, ఫ్రిడ్జ్ లు, ఇంకా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. ఈ సేల్ లో టీవీలు, అప్లియన్సెస్ పై 75 శాతం వరకు తగ్గింపులు ఉండనున్నట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.ఎలక్ట్రానిక్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ల్యాప్ టాప్స్ పై 40 శాతం, స్మార్ట్ వాచ్ లపై 60 శాతం వరకు, ట్రిమ్మర్లపై 70 శాతం వరకు, వైర్ లెస్ ఇయర్ బడ్స్ పై 799 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.వివిధ గృహోపకరణాలపై సైతం భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. రూ.99 నుంచే గృహోపకరాణాలు లభిస్తాయని వెల్లడించింది. ఇంటి ఫర్నీచర్, మాట్రిసెస్ పై 80 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.ఇంకా బ్యూటీ, టాయ్స్, ఇతర వస్తువులను రూ.99 నుంచి సొంతం చేసుకోవచ్చు. ఇంకా టీషర్ట్, షర్ట్స్, షూస్ తదితర ఫ్యాషన్ ఐటెమ్స్ పై 50 నుంచి 80 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.ఇంకా ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ, ఎక్సేంజ్ ఆఫర్లు లాంటి ఆఫర్లు సైతం ఫ్లిప్ కార్ట్ సేల్ లో అందుబాటులో ఉండనున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment