E-Filing చేసుకొనుటకు సూచనలు:
Financial Year (FY) 2021-22 అనగా Assessment Year (AY) 2022-23(1.4.21 to 31.3.22) సంవత్సరానికి సంబంధించిన Income Tax Return E Filing ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యింది. అయితే మన DDO లు TDS పూర్తి చేసిన తర్వాతనే మనం E Filing చేసుకొవలసి ఉంటుంది.ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ కోసం గత సంవత్సరం జూన్ 7 నుంచి ప్రారంభమైన కొత్త సైట్ ప్రారంభమైంది. వాస్తవానికి మనం ఈ ఫైలింగ్ ప్రతీ సంవత్సరం జులై 31 లోగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పరిస్ధితులను బట్టి ప్రభుత్వం ఈ గడువు పెంచవచ్చు.
గమనించవలసిన ముఖ్యవిషయం ఏమంటే ఇన్కమ్ టాక్స్ రిటర్న్ (ఈ - ఫైలింగ్) అనేది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేయాల్సిందే. 2,50,000 పైబడిఆదాయం కలిగిన వారందరూ *ఇన్కమ్ టాక్స్ పడనప్పటికీ* తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి.75 సంవత్సరాల సూపర్ సీనియర్ సిటిజన్స్ వారి ఆదాయం 5 లక్షల లోపు అయితే ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం నుండి మిన హాయింప బడ్డారు.ఇన్కమ్ టేక్స్ కడితేనే ఈ ఫైలింగ్ చేయాలి లేకపోతే అక్కరలేదు అనుకోవడం పొరపాటు. టేక్స్ తో సంభంధంలేకుండా రెండున్నర లక్షల వార్షికాదాయం దాటిన వారంతా ఈ ఫైలింగ్ చేయాలి.కారణం ఏదైనా ఎవరేని ఈ-ఫైలింగ్ చేయని వారికి రెండు మూడు సంవత్సరాల తరువాత కూడా ఐ టీ డిపార్టుమెంటు నుండి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.ఇన్కమ్ టాక్స్ సైట్ లో మనం ఈ ఫైలింగ్ ఎలా చేయాలో పరిశీలించుదాం.సైట్ లో ఇన్కమ్ టాక్స్ రిటరన్స్ ఈ ఫైలింగ్ ద్వారా సబ్మిట్ చేయాలి. వ్యక్తులు, వ్యాపార సంస్థలు ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి , రిఫండ్ కోరడానికి, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ సైట్ ఉపయోగపడుతుంది.ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ కు పాన్ నెంబర్ గానీ ఆధార్ నెంబరు గానీ యూజర్ ఐడి గాఉపయోగించాలి. పాస్వర్డ్ సహాయంతో మనం ఈ ఫైలింగ్ పేజీలో ప్రవేశించ గలుగుతాం.పాస్ వర్డ్ మరచిపోయిన సందర్భంలో forget పాస్ వర్డు ఆప్షన్ ద్వారా ఇ మెయిల్, ఫోన్ నెంబరు సహాయంతో దిగ్విజయంగా ఈ ఫైలింగ్ సైట్ లోకి ప్రవేశించవచ్చు. ఐటీ రిటర్న్స్ ఈ ఫైలింగ్ చేయడానికి మనం ముందుగా గమనించాల్సినవి.
1.పాన్ మరియు ఆధార్ లింక్ అయి ఉండాలి.
2. ఆధార్ మన మొబైల్ నెంబర్ కు లింక్ చేయబడి ఉండాలి.
3. మన బ్యాంకు ఖాతా కు మొబైల్ నెంబర్ లింక్ చేయబడి ఉండాలి. (గమనిక- ఈ మూడు అంశాలు లో ఏది లేకపోయినా ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయలేము.)
4. మన జీతం/ పెన్షన్ వివరాలతో డి డి ఓ ఇచ్చిన ఫారం16 / పెన్షనర్లు ఫిబ్రవరి పేస్లిప్ దగ్గర ఉంచుకోవాలి.
(గమనిక -టేక్స్ పే చేసిన పెన్షనర్లకు సంబంధిత ట్రెజరీలలో Form 16 ఏప్రియల్ నెలనుండి ఇస్తారు .టేక్స్ పడని పెన్షనర్లు పిబ్రవరి పేస్లిప్ లో ఉన్న Form 16 వివరాలతో ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు.)
5. లింక్ అయిన మొబైల్ దగ్గర ఉండాలి.ప్రస్తుతం I T ఈ ఫైలింగ్ పేజీలో పాన్ ,ఆధార్ లింక్ అవ్వడం ద్వారా మన వివరాలు ఉంటాయి.వాటిని ఎడిట్ చేసుకోవడానికి, అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది. మన ఫోటో కూడా ఆధార్ సైట్ నుండి కానీ నేరుగా గాని ఇక్కడ అప్డేట్ చేయ వచ్చు. New users అయితే మనం individual tax payer దగ్గర క్లిక్ చేసి 1. బేసిక్ డీటెయిల్స్ లో పాన్ నెంబర్, నేమ్, డేట్ అఫ్ బర్త్, జెండర్, రెసిడెన్షియల్ స్టేటస్ ఫిల్ చేయడంకానీ ఉన్న వివరాలను అప్డేట్ చేయడం గానీ ఎడిట్ ఆప్షన్ ద్వారా చేసుకొనే అవకాశం ఉంది.
2. కాంటాక్ట్ డీటెయిల్స్ లో సెల్ నెంబర్, అడ్రస్ వివరాలు పూర్తి చేయాలి. మన మొబైల్ ఓటీపీ ద్వారా వాలిడేట్ చేయాలి.
3. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయాలి..గతంనుండి ఐటి ఫైల్ చేస్తున్న ఎక్సిస్టింగ్ యూసర్స్ వివరాలు ప్రీఫిల్ చేసిఉంటాయి .. సరిచూసుకోవడం అవసరమైతే ఎడిట్ చేయడం చేయవచ్చు.మనం ఇపుడు ఐటి రిటరన్ ఫిల్ చేయడం గురించి చూద్దాం!!
లాగిన్ అయి అసెసెమెంట్ ఇయర్ ఎంటర్ చేసి Online filling ఆప్షన్ ఎంపిక చేసి Status లో individual సెలక్ట్ చేసి మనకు వర్తించే ఐ టి ఆర్ ఫారం సెలక్ట్ చేయాలి. మనం ITR 1 ఎంచుకోవాలి.
ఇక్కడ మనం 3 steps follow కావాల్సి ఉంటుంది.
1 Validate Your returns
2Conform your return summery
3.Verify and submit your return అనేవి.
Validate your return లో 5 అంశాలు ఉంటాయి.
1. Personal information
2.Gross total Income
3.Total deductions
4 Taxes paid
5. Total Tax Liability లను ఒకటి పూర్తి చేసిన తరువాత మరొకటి క్లిక్ చేసి ఓపన్ చేసి ఫిల్ చేసుకోవాలి.Personal information దగ్గర ఒక ముఖ్యమైన విషయం....
Are you opting for New Regime U/s 115BAC?
Old regime పద్దతి ద్వారా 1,50,000వరకూ సేవింగ్స్ , గృహఋణాలు ఉన్నవారు No పై క్లిక్ చేయడం వల్ల ఉపయోగం. ఏవిధమైన సేవింగ్స్ లేని 5లక్షల పై బడి ఆదాయం ఉన్నవారు New regime ఎంచుకుంటే Yes క్లిక్ చేసిముందుకు వెళ్ళాలి.Bank details లో మన పేరున ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలవివరాలు అప్డేట్ చేసినప్పటికి ఏదో ఒక ఖాతాను .టేక్స్ రిఫండ్ కోసం సెలక్ట్ చేసుకోవలసి ఉంటుంది.ఈ ఖాతాకు ఆధార్ , పాన్ , ఫోన్ లింక్ అయిఉండాలి.
2.Gross total Income దగ్గర ఇవ్వబడ్డ మనసేవింగ్స్ అన్నింటి పై సెక్షన్ల వారీగా Yes or No జవాబులతో ఫిల్ చేసిన తరువాత మన ఆదాయానికి, డిడక్షన్స్ కు సంబందించిన వివరాల పేజీ ఓపన్ అవుతుంది. అక్కడ ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలను అంకెలరూపంలో నింపి సేవ్ చేయాలి.కన్పర్మ్ చేయాలి.ఇక్కడ మన అకౌంట్ కు బ్యాంకు చెల్లించిన వడ్డీ ని కూడా చూపవలసిఉంటుంది.మన ఆధార్ తో లింక్ అయ్యి, వివిధ బ్యాంకులలో మనకి ఏవేని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లయితె వాటికి బ్యాంకు చెల్లించె వడ్డీలకు సదరు బ్యాంకు IT ని cut చేసిందీ,లేనిదీ ధృవీకరించు కోవలసి యుంటుంది.
3.Total deductions: మనం సేవ్ చేసిన మొత్తం ఏఏ సెక్షన్లలో ఎంత అనే అంశాలను ఇక్కడ Yes or No ద్వారా చూపి కంటీన్యూ చేసి ఓపన్ అయిన విండోలో ఎడిట్ ఆప్షన్ ద్వారా అంకెల రూపంలో నింపాలి.
4 Taxes paid మనం కట్టిన టేక్స్ వివరాలు ఇక్కడ సంబందిత కాలమ్ లో నింపాలి.కన్ఫర్మ్ చేయాలి. మనం ఇప్పటికే టేక్స్ కన్నా అదనంగా ఐటి కి చెల్లించి ఉంటే ఫారం16 ప్రకారం రిఫండ్ కోసం ఇక్కడ చూపుతాం.
5. Total Tax Liability పై క్లిక్ చేసి మనం ఇప్పటి వరకూ నింపిన వివరాలన్నింటిని సరిచూసుకొని కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి.మనం అదనంగా కట్టిన మొత్తం ఉంటె రిఫండ్ క్లైమ్ చేయాలి. ఇపుడు మన టేక్స్ రిటరన్ అన్నివివరాలు కనిపిస్తాయి వాటి ప్రివ్యూ పై క్లిక్ చేయండి . ఓపన్ అయిన విండోలో వివరాలను సరిచూసుకొని ... Proceed to Validation - ఆపై Proceed to Verifcation కు వెళ్ళండి.(ఈ వివరాలన్నింటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు.) ఆధార్ వెరిఫికేషన్ ద్వారా మీ మొబైల్ ఓటిపి ద్వారా వెరిఫికేషన్ ఆప్షన్ ఎంచుకొండి. తరువాత వచ్చే Acknowledgement Print తీసుకొండి.వివిధ కారణాల రీత్యా మొబైల్ OTP రాని పక్షంలో వెరిఫికెషన్ పూర్తికావడానికి అకనాలెడ్జ్ మెంట్ ను అకనాలెడ్జ్ మెంట్ లో సూచించబడిన బెంగళూరు అడ్రస్ కు పోస్ట్ చేయవలసియుంటుంది.
Income Tax ఈ ఫైలింగ్ -కొన్ని ప్రశ్నలు-జవాబులు.
నా సంవత్సరాదాయంపై ఆదాయపుపన్ను లేదు ఐటి రిటరన్స్ దాఖలు చేయాలా? చేయకపోతే ఏమిటి? ట్రెజరీ వారు నా ఆదాయంలో కొంత పన్నుగా డిటక్ట్ చేసుకొన్నారు నేను ఐటి రిటరన్స్ ఇవ్వడం అవసరమా?
ఇటువంటి మన అనుమానాలకు ఆదాయపు పన్ను శాఖ వారిచ్చిన జవాబులు ఓ సారి పరిశీలించండి.
ప్రశ్న). రిటర్న్ దాఖలు చేయనందుకు జరిమానా ఏమిటి?
జవాబు). గడువు తర్వాత దాఖలు చేసిన రిటర్న్‌లు(ఇ ఫిల్లింగ్), పెనాల్టీ పరిమితి రూ.5,000కి పెంచబడింది. అయితే, చిన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనంగా, మీ మొత్తం ఆదాయం రూ. 5 లక్షలకు మించకపోతే, ఆలస్యమైతే గరిష్టంగా రూ. 1000 జరిమానా మాత్రమే ఉంటుందని ఐటీ శాఖ పేర్కొంది.
ప్రశ్న). నా ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉన్నట్లయితే నేను పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాలా?
జవాబు). పన్ను చెల్లించదగిన ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉంటే మీరు పన్నులు చెల్లించనవసరం లేనప్పటికీ, మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయాలి. మీరు ITR ఫైల్ చేయడంలో విఫలమైతే, మీరు ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసును పొందవచ్చు
ప్రశ్న) ట్రెజరీ వారు నా ఆదాయంలో కొంత పన్నుగా డిటక్ట్ చేసుకొన్నారు నేను ఐటి రిటరన్స్ ఇవ్వడం అవసరమా?
జవాబు) ఆదాయం నుండి ఆదాయపు పన్ను డిడక్ట్ చేయబడిన వారు ఖచ్చితంగా ఐటి రిటరన్స్ సబ్మిట్ చేయాలి
ప్రశ్న) ఎవరు ఐటీఆర్‌ను ఫైల్ చేయాలి?
జవాబు) సాధారణంగా ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 2.5 లక్షలు కంటే ఎక్కువ ఇన్‌కమ్ సంపాదిస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో వ్యక్తి సంపాదించిన ఇన్‌కమ్ (గ్రాస్) బేసిక్ మినహాయింపును మించితే, ఆ వ్యక్తి ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే.
ప్రశ్న) కొత్త ట్యాక్స్ సిస్టమ్ ఎంచుకుంటే హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ), లీవ్ ట్రావెల్ అలవెన్స్ వంటి కామన్ ట్యాక్స్ మినహాయింపులను క్లయిమ్ చేసుకోవచ్చా ?
జవాబు) వీలు లేదు.
ప్రశ్న) పాత ట్యాక్స్ సిస్టమ్‌ను ఎంచుకుంటామనుకుంటే బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపు ఎంత?
జవాబు) బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపు ఏజ్‌ను బట్టి మారుతుంది. బేసిక్ ఎక్జంప్సన్ 60 ఏళ్లలోపు వాళ్లయితే, సంపాదించిన ఆదాయంలో రూ. 2.5 లక్షలు , 60–80 ఏళ్లు మధ్య ఉన్న వారి (సీనియర్ సిటిజన్స్) ఇన్‌కమ్ రూ. 3 లక్షలు , 80 ఏళ్ల పైన ఉంటే (సూపర్ సిటిజన్స్) రూ. 5 లక్షలుగా ఉంది.
ప్రశ్న) ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఐటీఆర్ ఎవరు ఫైల్ చేయాలి?.
జవాబు) కింద పేర్కొన్న కేటగిరీలు వారు తప్పని సరిగా ఐటిఆర్ ఫైల్ చేయాలి
1) ఫారిన్ కంట్రీకి ట్రావెల్ చేయడానికి తన కోసమైన లేదా ఇతరుల కోసమైన ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినవాళ్లు.
2) ఒక అకౌంట్ లేదా వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ. కోటి కంటే ఎక్కువ డిపాజిట్ చేసినవారు.
3) ఫైనాన్షియల్ ఇయర్‌లో ఒకే ఎలక్ట్రిసిటీ బిల్లులో రూ. లక్ష చెల్లించిన వారు.
4) విదేశాల నుంచి ఆదాయం వస్తున్న వారు. విదేశాల్లో ఆస్తులు ఉన్నవారు.
5) క్యాపిటల్ గెయిన్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని కొన్ని మినహాయింపులను క్లయిమ్ చేసుకోకముందే, వ్యక్తి గ్రాస్ ఇన్‌కమ్ బేసిక్ మినహాయింపును దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాలి.
6) ఫైనాన్షియల్ ఇయర్‌లో వ్యక్తి యొక్క ఆదాయం బేసిక్ మినహాయింపును దాటకపోయినా, ట్యాక్స్ కట్ అయితే రీఫండ్ కోసం ఐటీఆర్ ను ఫైల్ చేయాలి.
ఎవరు ఐటీఆర్‌ను ఫైల్ చేయాలి?
సాధారణంగా ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 2.5 లక్షలు కంటే ఎక్కువ ఇన్‌కమ్ సంపాదిస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలి.
ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో వ్యక్తి సంపాదించిన ఇన్‌కమ్ (గ్రాస్) బేసిక్ మినహాయింపును మించితే, ఆ వ్యక్తి ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపు వ్యక్తి ఎంచుకున్న ట్యాక్స్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇండివిడ్యువల్ కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ను ఎంచుకుంటే ఆమె లేదా అతని బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపు రూ. 2.5 లక్షలు. పాత ట్యాక్స్ సిస్టమ్‌లో అయితే బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపు ఏజ్‌ను బట్టి మారుతుంది. కానీ, కొత్త ట్యాక్స్ సిస్టమ్‌లో ఏజ్‌ను బట్టి మినహాయింపు ఇవ్వడాన్ని తొలగించారు.
కొత్త సిస్టమ్‌లో సీనియర్ సిటిజన్లకు అదనంగా బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపును ఇవ్వడం లేదు. కానీ, పాత ట్యాక్స్ సిస్టమ్‌తో పోలిస్తే కొత్త సిస్టమ్‌లో ట్యాక్స్ రేట్లను తగ్గించారు. మరోవైపు ట్యాక్స్ డిడక్షన్లను తొలగించారు. అంటే ఒక వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం కింద రూ. 20 వేలు కడితే, ఆ వాల్యూని ఇన్‌కమ్ నుంచి కట్ చేసుకొని మిగిలిన అమౌంట్‌పై ట్యాక్స్ లెక్కించొచ్చు. కొత్త సిస్టమ్‌లో ఈ ఫెసిలిటీ లేదు.
కొత్త ట్యాక్స్ సిస్టమ్ ఎంచుకుంటే హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ), లీవ్ ట్రావెల్ అలవెన్స్ వంటి కామన్ ట్యాక్స్ మినహాయింపులను క్లయిమ్ చేసుకోవడానికి ఉండదు. అదేవిధంగా సెక్షన్ 80 సీ, 80డీ, 80టీటీఏ కింద డిడక్షన్లు కూడా అందుబాటులో ఉండవు. ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్) అకౌంట్ కోసం ఎంప్లాయర్ చేసే కంట్రిబ్యూషన్‌పై మాత్రమే (సెక్షన్ 80సీసీడీ(2)) ట్యాక్స్ డిడక్షన్ అందుబాటులో ఉంటుంది.
పాత ట్యాక్స్ సిస్టమ్‌ను ఎంచుకుంటామనుకుంటే బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపు ఏజ్‌ను బట్టి మారుతుంది. అంటే 60 ఏళ్లలోపు ఏజ్ ఉన్నవాళ్లయితే, ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో సంపాదించిన ఆదాయం రూ. 2.5 లక్షలు దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. అదే 60–80 ఏళ్లు మధ్య ఉన్న వారి (సీనియర్ సిటిజన్స్) ఇన్‌కమ్ రూ. 3 లక్షల పైన ఉంటే ఐటీఆర్ ఫైల్ చేయాలి. 80 ఏళ్ల పైన ఉంటే (సూపర్ సిటిజన్స్) రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వస్తే ఐటీఆర్ ఫైల్ చేయాలి.
ఐటీఆర్ ఫైల్ చేయడానికి..
కొన్ని సార్లు వ్యక్తి ఆదాయం బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపును దాటకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం, కింద పేర్కొన్న కేటగిరీలు ఐటీఆర్ ఫైల్ చేయాలి.
1) ఫారిన్ కంట్రీకి ట్రావెల్ చేయడానికి తన కోసమైన లేదా ఇతరుల కోసమైన ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినవాళ్లు.
2) ఒక అకౌంట్ లేదా వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ. కోటి కంటే ఎక్కువ డిపాజిట్ చేసినవారు.
3) ఫైనాన్షియల్ ఇయర్‌లో ఒకే ఎలక్ట్రిసిటీ బిల్లులో రూ. లక్ష చెల్లించిన వారు.
4) విదేశాల నుంచి ఆదాయం వస్తున్న వారు. విదేశాల్లో ఆస్తులు ఉన్నవారు.
5) క్యాపిటల్ గెయిన్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని కొన్ని మినహాయింపులను క్లయిమ్ చేసుకోకముందే, వ్యక్తి గ్రాస్ ఇన్‌కమ్ బేసిక్ మినహాయింపును దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాలి.
6) ఫైనాన్షియల్ ఇయర్‌లో వ్యక్తి యొక్క ఆదాయం బేసిక్ మినహాయింపును దాటకపోయినా, ట్యాక్స్ కట్ అయితే రీఫండ్ కోసం ఐటీఆర్ ను ఫైల్ చేయాలి.
0 comments:
Post a Comment