రేపటి నుండి నగదు డిపాజిట్ లో కొత్త రూల్స్

 Income Tax Rule PAN, Aadhaar Must for Cash Withdrawals, Deposits in These Cases from Tomorrow : ప్రజలకు అలర్ట్‌! మే 26 నుంచి దేశంలో నగదు డిపాజిట్‌ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి.ఇకపై బ్యాంకుల నుంచి ఒక ఏడాదిలో రూ.20 లక్షలకు మించి విత్‌డ్రా లేదా డిపాజిట్‌ చేస్తే ప్రజలు కచ్చితంగా పాన్‌ లేదా ఆధార్‌ నంబర్‌ ఇవ్వాలి. కో ఆపరేటివ్‌ బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనూ ఈ నిబంధనల అమల్లోకి వస్తుంది. కరెంట్‌ ఖాతా ఓపెన్‌ చేస్తున్నప్పుడూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ (CBDT) కొన్ని రోజుల ముందు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

'ఒక లావాదేవీ ఒప్పందంలోకి ప్రవేశిస్తున్నప్పుడు టేబుల్‌లోని రెండో కాలమ్‌లో తమ ఆధార్‌ లేదా పాన్ నంబర్‌ను నమోదు చేయాలి. అవతలి వ్యక్తి ఇచ్చిన ఆధార్‌ లేదా పాన్‌ సరైందేనని టేబుల్‌లోని మూడో కాలమ్‌లో స్వీకర్త ధ్రువీకరించాలి' అని సీబీడీటీ తెలిపిందిగతంలో ఒక రోజులో రూ.50వేలకు మించి డిపాజిట్‌ చేస్తే పాన్‌ కార్డు అవసరం అయ్యేది. 114బి నిబంధన పరిధిలో ఉంటారు కాబట్టి ఏడాది కాలంలో నగదు డిపాజిట్లు, విత్‌డ్రావల్స్‌పై పరిమితి ఉండేది కాదు. అంతేకాకుండా బ్యాంకులో డిపాజిట్‌ చేసినప్పుడు మాత్రమే ఈ నిబంధన వర్తించేది.

ఒకవేళ బ్యాంకులో ఏడాదిలో రూ.20 లక్షలకు మించి డిపాజిట్‌ లేదా విత్‌డ్రావల్‌ చేసినప్పుడు పాన్‌ లేకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. వారం రోజుల్లోగా దరఖాస్తు చేస్తామని ధ్రువీకరించాలి. ఒకవేళ అప్పటికే పాన్‌ నంబర్‌ ఉంటే నిర్దేశించిన కాలమ్‌లో ఆ సంఖ్య వేస్తే సరిపోతుంది. ఆర్థిక నేరాలు, మోసాలు అరికట్టేందుకు, అత్యధిక విలువగల లావాదేవీలను పన్నుల శాఖ పర్యవేక్షించేందుకు ఈ నిబంధనలు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా నగదు మూమెంట్‌ను గమనించేందుకూ ఇది ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top