ప్రశ్నపత్రాలు ఎలా ఉండాలి?

పదోతరగతి పరీక్షల్లో పాఠ్యాంశాల వారీగా ప్రశ్నపత్రాలు రెండు ఉండాలా ఒకటే సరిపోతుందా అంటూ ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఉపాధ్యాయులను ఆరా తీశారు. ఆయన మచిలీపట్నంలోని సెయింట్‌ఫ్రాన్సిస్‌ పాఠశాలలో నిర్వహిస్తున్న మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ప్రతి సబ్జెక్టుకు రెండు ప్రశ్నపత్రాలు ఉండగా ఈసారి సైన్సు మినహా మిగిలిన వాటిని ఒకే దానితో నిర్వహించారు. ఈ విధానం కొనసాగించవచ్చా అని అడగ్గా పలువురు ఉపాధ్యాయులు రెండు ఉంటేనే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. మూల్యాంకన నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. డీిఈవో తాహెరా సుల్తానా, డీవైఈవో యూవీ సుబ్బారావు, ప్రభుత్వ పరీక్షల జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ గూడూరు శ్రీనివాస్‌, డిప్యూటీ క్యాంప్‌ అధికారి లలిత్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top