ఇళ్లు కొనడం లేదా నిర్మించడం మన జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం. ఈ క్రమంలో చాలా మంది గృహ రుణం తీసుకుంటుంటారు.లోన్ వల్ల ఇంటిని సొంతం చేసుకోవడంతో పాటు కొన్ని ఆర్థిక ప్రయోజనాలనూ పొందొచ్చు. మరి తొలిసారి గృహరుణం తీసుకుంటున్నవారికి ఉండే లాభాలేంటో చూద్దాం..
పన్ను మినహాయింపు: గృహరుణంపై చెల్లించే వడ్డీకి ఏటా రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24(బీ) కింద ఈ ప్రయోజనం పొందొచ్చు. అలాగే సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు అసలు (principal amount) మొత్తానికి కూడా పన్ను మినహాయంపు ఉంటుంది.
సహ-దరఖాస్తుదారుడు: రుణం మనకు భారంగా మారుతుందనుకుంటే సహ-దరఖాస్తుదారుణ్ని చేర్చుకునే వెసులుబాటు గృహ రుణంలో ఉంటుంది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎక్కువ మొత్తం రుణాన్ని పొందొచ్చు. ఇద్దరికీ పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. ఎప్పుడైనా ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తినా ఈఎంఐల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవచ్చు.
మహిళలు సహ-దరఖాస్తుదారురాలిగా: గృహరుణం తీసుకునే మహిళలకు ప్రత్యేకంగా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. సహ-దరఖాస్తుదారురాలిగా ఉన్నా.. ఈ లాభాలను పొందొచ్చు. చాలా బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు వడ్డీరేటులో మహిళలకు ప్రత్యేకంగా తగ్గింపునిస్తాయి.
ఓవర్‌డ్రాఫ్ట్ వసతి: హోంలోన్ కింద ఓవర్‌డ్రాఫ్ట్ వసతిని పొందే అవకాశం ఉంటుంది. తరచూ నగదు అవసరం ఉండేవారు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి వడ్డీలేకుండానే గడువు తీరేలోగా తిరిగి చెల్లించేయొచ్చు. పైగా ఓడీ ద్వారా తీసుకున్న మొత్తాన్ని తిరిగి గృహరుణ చెల్లింపునకు కూడా ఉపయోగించుకోవచ్చు. పాక్షిక ముందస్తు చెల్లింపు వల్ల దీర్ఘకాలంలో అధిక వడ్డీ భారాన్ని తప్పించుకోవచ్చుటాప్-అప్: ఏదైనా అత్యవసర పరస్థితి తలెత్తి పెద్ద ఎత్తున డబ్బు అవసరం పడితే.. హోంలోన్‌పై టాప్-అప్ తీసుకొని వినియోగించుకోవచ్చు. పిల్లల చదువులు, వైద్య ఖర్చుల వంటి సమయంలో ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. మిగిలిన మార్గాలతో పోలిస్తే.. తక్కువ వడ్డీకే రుణం పొందే అవకాశం ఉంటుంది.
0 comments:
Post a Comment