*ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పంపిన ప్రభుత్వం
సీపీఎస్ పై చర్చించేందుకు ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. మంగళవారం ఈ అంశంపై సంప్రదింపులకు రావాలని పలు సంఘాల నేతలను పిలిచింది. ఏప్రిల్ 25న ఒక దఫా చర్చలు జరిపింది. సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్(గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ )ను ప్రతిపాదించిన ప్రభుత్వం.. దానిపై అధ్యయనం చేసేందుకు అవసరమైన సమాచారాన్ని ఆ సమావేశంలో సంఘాల నేతలకు ఇచ్చింది. తిరిగి రెండోసారి చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని ఆర్థిక శాఖ కార్యాలయం సమావేశం జరగనుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న 16 సంఘాలను ఈ సమావేశానికి పిలిచారు. ఎన్జీవో, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఎన్టీయూ, పీఆర్డీ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ తదిదర సంఘాల నేతలను ఆహ్వానించారు.
0 comments:
Post a Comment