PRC GO No 1 , మరియు110 అనుసరించి PRC అమలు తేది 1/7/2018 దాటి 31/12/2021 వరకూ రిటైర్ అయిన ఉద్యోగులకు వారి డిడివో లు PRC fixation చేసి SR ఎంట్రీలు వేయాలి.
పి ఆర్ సి ఫిక్సేషన్ వల్ల మనకు స్టేజ్ బెనిపిట్ వస్తుంది. అందువల్ల ప్రతీ పెన్షనర్ కు 100నుండి 400 వరకూ పెన్షన్ పెరిగే అవకాశంఋఉంది. ఆబేసిక్ పై మనం రివైజ్డ్ పెన్షన్ ప్రపోజల్స్ తయారు చేసుకొని డిడివో ద్వారా AG కార్యాలయం వారికి అప్రూవల్ నిమిత్తం సమర్పించవలెను. AG కార్యాలయం వారు PRC 2022 పిక్సేషన్ ఆధారంగా మన రివైజ్డు బేసిక్ పెన్షన్ , ప్యామలీ పెన్షన్ వివరాలతో,కమ్యూటేషన్ చెల్లింపు వివరాలతో రివైజ్డు పిపివో మంజూరు చేస్తారు. దాని ఆధారంగా మన STO గారు రివైజ్డు పెన్షన్ అప్రూవల్ చేసి బకాయిలు చెల్లింపుకు తగు ఏర్పాటు చేస్తారు.
ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని ముఖ్యాంశాలు
1)1/7/18 తరువాత రిటైర్ అయిన వారందరికి రివైజ్డు పే ఆధారంగా కమ్యుటేషన్ డిఫరెన్స్ క్లైమ్ చేసుకోవచ్చు.నోషనల్ పిరియడ్ తో సంబంధం లేదు.
2) నోషనల్ పిరియడ్ అనగా 1/7/18 నుండి 31/3/2020 లో రిటైర్ అయినవారికి ఎన్కేష్మెంట్ ఆఫ్ ఇ ఎల్ పై డిఫరెన్స్ రాదు.
3.1/4/2020 దాటిన తరువాత రిటైర్ అయిన వారందరికి 2015 పే ఆపై 2022 పే పై వచ్చె తేడావల్ల ఎన్కేష్మెంట్ ఆఫ్ ఇ ఎల్ /హాఫ్ పే లీవు పై వచ్చే డిఫరెన్స్ క్లైమ్ చేసుకోవచ్చు.
3)గ్రాట్యుటీ విషయంలో 2015 పి ఆర్ సి లో ఉన్న సీలింగ్ 12లక్షలను పేతక్కువగా ఉన్నందున పూర్తిగా పొందలేక పోయి 2022 పి ఆర్ సి ఫిక్సేషన్ లో పే పెరిగినందున 12లక్షలు పొందుటకు అర్హత సాధించినచో అట్టివారు రివైజ్డు పెన్షన్ ప్రపోజల్స్ లో AG గారి అనుమతికి సమర్పించవచ్చు. అయితే 1/7/18 తరువాత నోషనల్ పిరియడ్ 31/3/2020 మధ్య రిటైర్ అయిన వారికి వర్తించదు.1/4/2020 దాటిన తరువాత వారికి వర్తిస్తుంది.కావున 1/7/2018 తరువాత రిటైర్ అయిన వారు వెంటనే
పి ఆర్ సి2022 పిక్సేషన్ చేయమని డిడివో గారినికోరుతూ ఓ లేఖ ఇవ్వడం, ఫిక్సేషన్ అయినవెంటనే SR తీసుకొని రివైజ్డు పెన్షన్ ప్రపోజల్స్ 4సెట్లు తయారుచేయించుకొని కమ్యుటేషన్ డిఫరెన్స్ క్లైమ్ , 1/4/2020 తరువాత రిటైర్ అయి గ్రాట్యుటీ 12లక్షలు పొందని వారు ఆక్లైమ్ తో డిడివో ద్వారా AG కార్యాలయం , విజయవాడ పంపుకొనుటకు తగుఏర్పాట్లు చేసుకోవచ్చు.
0 comments:
Post a Comment