జూన్ 14, 15 తేదీల్లో పాఠ శాలలను తెరిచే అవకాశాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘం(ఏపీపీయూఎస్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు గురువారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించినట్లు సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎంవీ రామంచంద్రారెడ్డి, కె.తులసి విష్ణుప్రసాద్ తెలిపారు. పది విద్యా సంవత్సరాలపాటు అమలయ్యేలా ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపు ఇవ్వా లని, ప్రీప్రైమరీ తరగతులకు అనుమతివ్వాలని, ప్రభుత్వ పాఠశాలల తీరునే ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకూ ప్రతిభ అవార్డులు ఇవ్వాలని కోరామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment