Uses of Butter Milk | వేసవికాలంలో మజ్జిగ వల్ల ఉపయోగాలు



యోగ రత్నాకరం అనే వైద్య గ్రంథంలో ఈ చమత్కార విశ్లేషణ కనిపిస్తోంది. మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకుండా ఉంటాయనీ, 'విషదోషాలు', 'దుర్బలత్వం', 'చర్మరోగాలు', 'క్షయ', 'కొవ్వు', 'అమిత వేడి' తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని దీని భావం.అక్కడ దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడంట.

వేసవి కాలాన్ని మనం మజ్జిగతోనే ఎక్కువగా గడిపెందుకు ప్రయత్నించాలి. తోడుపెట్టి నందువల్ల పాలలో వుండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు, అధనగా 'లాక్టో బాసిల్లై' అనే 'మంచి బాక్టీరియా' మనకు దొరుకుతోంది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు. అందుకని, వయసు పెరుగు తున్నకొద్దీ మజ్జిగ అవసరం పెరుగుతోంది. ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరార్థకం అవుతోంది. అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. చిలికినందువల్ల మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తోంది. అందుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది. వేసవి కోసం ప్రత్యేకం 'కూర్చిక పానీయం" ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండు గ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి. ఈ పానీయాన్ని 'కూర్చిక' అంటారు. ఇందులో 'పంచదార' గానీ, 'ఉప్పు' గానీ కలపకుండానే తాగవచ్చు. 'ధనియాలు', 'జీలకర్ర', 'శొంఠి' ఈ మూదింటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి , మూదింటిని కలిపి తగినంత 'ఉప్పు' కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి. 'కూర్చిక'ను తాగినప్పుడల్లా, అందులో దీన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి. వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్ని పెంపొందిస్తుంది. జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తోంది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది.ఎoడలోకి వెళ్లబోయే ముందు దీన్ని తాగండి. చక్కగా 'చిలికిన మజ్జిగ' ఒక గ్లాసునిండా తీసుకోని, అందులో ఒక 'నిమ్మకాయ రసం', తగిన౦త 'ఉప్పు', 'పంచదార', చిటికెడు ఉప్పు, 'తినేసోడాఉప్పు' కలిపి తాగి అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళితే వడదెబ్బ బారి నుండి తప్పించుకోవచ్చు. మరీ ఎక్కువ ఎండ తగిలితే, తిరిగి వచ్చిన తరువాత ఇంకో సారి సేవించాలి. ఎండలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసానిండా దీన్ని తయారు చేసుకొని వెంట తీసుకెళ్లండి. మాటిమాటికీ తాగుతూ ఉంటే వడదెబ్బ మీ దరి చేరదు.

Posted in: , , ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top