UDISE+ 2021-22 Data Capture Format (DCF)ఈ Format ను అన్ని యాజమాన్యాల కు సంబందించిన ప్రతి పాఠశాల/కళాశాల వారు print తీసు కొని అన్ని coloumns fill చేసిన అనంతరం, Data Entry Online చేయాలి. ఈ ఏడాది నుండి enter చేసే Data కేంద్ర ప్రభుత్వానికి చేరుతుంది. అందుకే ముందుగా Manual గా fill చేసుకుంటే Online Data Entry కి సులభం అవుతుంది. దీనికి సంబందించిన ఖర్చు ను పాఠశాలల కు వచ్చే నిధులనుండి తీసుకోవచ్చు.
అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది...
udise+ 2021-2022 కి సంబంధించి మీ పాఠశాలకు సంబందించిన స్కూల్ రిపోర్ట్ కార్డు పైన జతచేయడమైనది.సదరు రిపోర్ట్ కార్డు ను ప్రింట్ తీసుకుని ఏమైనా మార్పులు ఉంటే red ink పెన్ తో రౌండ్ చేయవలెను. అదేవిధంగా UDISE+ 2021-2022 DCF (DATA CAPTURE FORMAT) జత చేయడమైనది. సదరు ఫార్మటు కూడా ప్రింట్ తీసుకుని మీ పాఠశాలకు సంబందించిన డేటా ఫిల్ చేసుకుని రెడీగా ఉంచుకోవలెను. తరువాత https://udiseplus.gov.in website నందు లాగిన్ అయ్యి డేటా ఎంటర్ చేయవలెను. లాగిన్ అవ్వడానికి user name మరియు password లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి text message లో send చేయబడినవి. వాటితో లాగిన్ అయ్యి డేటా ఎంట్రీ చేయవలెను. డేటా ఎంట్రీ కంప్లీట్ అయ్యిన తరువాత red ink తో correction చేసిన స్కూల్ రిపోర్ట్ కార్డు మరియు ఫిల్ చేసిన DCF ఒక సెట్ ఈ కార్యాలయమునకు సమర్పించవలెను.
గమనిక:- 1. స్కూల్ రిపోర్ట్ కార్డు నందు September 2019 డేటా ప్రింట్ చేయబడినది. corrections చేసేటపుడు September 2021
డేటాను ప్రాతిపదికగా తీసుకోవలెను.
2. DCF ఫిల్ చేసేటపుడు కూడా September 2021 డేటాను ప్రాతిపదికగా తీసుకుని ఫిల్ చేయవలెను.
3. ఈ సంవత్సరం నుండి డేటా కేంద్ర ప్రభుత్వ web portal చేస్తాము. కావున డేటా డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వానికి చేరుతుంది.
కావున డేటా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయవలెను.
website నందు డేటా ఎంట్రీ ఆప్షన్ ఇంకా enable చేయబడలేదు. enable చేసిన వెంటనే తెలియజేసెదము. ఈ లోపుగా 30.04.2022 లోగా ఈ రెండు ఫార్మాట్ లు సిద్ధంగా ఉంచుకోవలసినదిగా కోరడమైనది.
UDISE 2021-22 Online Data Entry
0 comments:
Post a Comment