ఏప్రిల్ 7 నుంచి పాఠశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలుంటాయని తెలంగాణ విద్యాశాఖ బుధవారం తెలిపింది. అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు
ఉంటాయని వెల్లడించింది. జూన్ 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి 18వ తేదీ వరకు ఎస్ఏ-2 పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఏప్రిల్ 23వ తేదీ ఈ విద్యాసంవత్సరంలో చివరి పని దినమని అదే రోజు పరీక్షల ఫలితాలు వెల్లడిస్తారని వివరించింది.
0 comments:
Post a Comment