ప్రతి టెలికం సంస్థ కూడా ఖచ్చితంగా పూర్తిగా నెల రోజుల(30,31) వ్యాలిడిటీని ఆఫర్ల చేసే ప్రీపెయిడ్ ప్లాన్ కనీసం ఒక్కటైనా ఉండాలని TRAI సూచించిన సూచన మేర, రిలయన్స్ జియో తన కస్టమర్లకు అధిక లాభాలను అందించే కొత్త 'క్యాలండర్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్' ను తీసుకువచ్చింది.జియో ప్రీపెయిడ్ ప్లాన్ లిస్ట్ లి కొత్తగా చేరిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.259 రూపాయలకు వస్తుంది. ఈ కొత్త జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి నెల రోజుల వ్యాలిడిటీతో పాటుగా డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ వంటి మరిన్ని ప్రయోజాలను కస్టమర్లకు అందిస్తుంది. మరి జియో లేటెస్ట్ గా తీసుకొచ్చిన ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అఫర్ చేసే ప్రయోజాలను గురించి చూద్దామా.
జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి నెల రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 1.5 GB హై స్పీడ్ డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.
ఇక సంవత్సరం మొత్తం అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ కోసం చూనట్లయితే జియో యొక్క రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ అమౌంట్ ను 12 నెలలకు విడదీసి చూస్తే, నెలకు కేవలం రూ.250 రూపాయలు మాత్రమే అవుతుంది. అయితే, ఈ ప్లాన్ డైలీ 2.5GB హై స్పీడ్ డేటా మరియు మరిన్ని లాభాలను తీసుకు వస్తుంది. ఈ జియో బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్ అందించే లాభాలను గురించి క్రింద చూడవచ్చు.
Jio Rs.2,999 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హాయ్ స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రూ.499 రూపాయల విలువైన వన్ ఇయర్ డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సభ్యత్వం కూడా ఉచితంగా లభిస్తుంది.
0 comments:
Post a Comment