ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ పై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది.ఈమేరకు 25వ తేది సోమవారం జిఓ సంఖ్య 716 ద్వారా మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ లతో ఐదుగురు సభ్యులతో కూడిన మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చించిన తర్వాత ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పిస్తుంది. సిపిఎస్ పై ఆందోళనలు ఉదృతం అవుతున్న విషయం తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment