*300 యూనిట్ల నిబంధన యథాతథం
*75% హాజరు తప్పనిసరి
పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కుటుంబాలకు ఆర్ధికంగా అండగా ఉండేందుకు ప్రవేశపెట్టి న జగనన్న అమ్మ ఒడి పదకానికి సంబందించిన గడ కౌత్త విద్యా సంవత్సరం ప్రారంభంలో అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏటా జనవరిలో అమ్మ ఒడిని అందిస్తామని ప్రారంభంలో ప్రకటించిన ప్రభుత్వం గతేడాది మాత్రం ఇవ్వలేదు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, ప్రభుత్వం కూడా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవడం తదితర కారణాల చల్ల ఈ ఏడాది జనవరిలో విడుదల కావాల్సిన అమ్మబడి నిధులు జులైలో అందించనుంది. ఈ పథకం ఉద్దేశం అధిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి బడిమానే దనేదే. ఈ నేపథ్యంలో విద్యార్థుల హాజరు కచ్చితంగా 75 శాతానికి మించి ఉండాలనే నిబంధనను పథకం ప్రారంభిం చినప్పుడే ప్రభుత్వం ప్రకటించింది. అయితే గత రెండేళ్లు కరోనా కారణంగా బాజ్ డౌన్ కర్వ్యూలు విధించడం, ప్రభు శ్వమేపాఠశాలలకు సెలవులివ్వడంతో ఆ నిబంధన మేరకు హాలకు ఎక్కడా నమోదు కాదు దీంతో గతేడాది వరకు హాజరు మినహాయింపునిచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది వ్యాక్సి నేషన్ దాదాపుగా అందించడం, కరోనా విజృంభణ క్షీణించడంతో రాబోయే విద్యా సంవత్సరం నుంచి 75 శాతం హాజరును తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే నిబంధనల ప్రకారం బడికెళ్లే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 14 వేల మొత్తాన్ని జమ చేయనుంది. తొలుత ఏడాదికి రూ. 15 వేల చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వస్తానని ప్రకటించిన ప్రభుత్వం, అందులోంచి రూ. వెయ్యి చొప్పున బాయ్లెట్ మెయింటనెన్స్ పండ్ కు జమ చేయాల వి నిర్ణయించింది. తద్వారా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎక్కు మొత్తాన్ని పాఠశుధ్య కార్యక్రమాల కోసం వెచ్చించనుంది. మరోవైపు జిల్లాల పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో అమ్మఒడి పథకం వర్తించాలంటే కొత్త జిల్లాల అడ్రస్అతో ఆచార్ కార్డులు, ఇతర చిరునామాలు మార్చుకో చాలనే ప్రచారం జరుగుతోంది. అయితే కొత్త జిల్లాలకు కేంద్రం వద్ద అప్రూవల్ వ్యవహారం పూర్తి కాకపోవడం. ఆధార్ను నిర్వహించేల యునిక్ ఐడెంటిఫికేషన్ ఆచారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)లో నమోదు కాకపోవడంతో ఈ విద్యా సంవత్సరానికి పాత జిల్లాల అడ్రస్: రాష్ట్ర ప్రభుత్వం అమ్మ బడిని వర్తింపజేయనుంది. అలాగే మరి కొన్ని సందేహాలకూ విద్యాశాఖ స్పష్టతనిచ్చింది.
300 యూనిట్లు మించకూడదు.
అమ్ముఒడి పథకం వర్తించే విద్యార్ధుల కుటుంబాలలో విద్యుత్ వాడకం 3AM) యూనిట్లు మించకూడదని సచకం. ప్రారంభంలోనే ప్రభుత్వం పేర్కొంది. అయితే ఉమ్మడి కుటుంబాలు, అద్దెలకు ఉండే కుటుంబాలలో కామన్ మీటర్ విధానం ఉండటం తదితర కారణాలతో చాలా మంది విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటుతోంది. అందుకోసం ఆయా కుటుంబాలు సంబంధిత విద్యు త్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి లేఖ సమర్పించాలని గతంలో సూచించారు. ఈ ఏడాది కూడా 300 యూనిట్ల నిబంధన ను అమలు చేస్తుండటంతో ఆ మొత్తం దాటిన విద్యార్థుల కుటుంబాలు ఏం చేయాలనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కొత్తగా అమ్మఒడి పథకం వర్తించే విద్యార్థుల తల్లులు, గార్డియన్లు తమ బ్యాంకు ఖాతాకి ఆధార్ లింకు కచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థి, వారి తల్లి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండేలా వివరాలు సరి చూసుకోవాలి అలా లేని వారు తమ గ్రామ, వార్డు సచివాలయ లలంటీర్ దగ్గర ఈకేవైసీ చేసుకుంటే అప్డేట్ అవుతుంది. అమ్మఒడి పథకం కోసం విద్యార్థి హాజరు శాతం 75 శాతం తోపాటు రైస్ కార్డు ఉండాలి. అలాగే విద్యార్థి కుటుంబానికి సంబంధించి మెట్ట భూమి అయితే 10 ఎకరాలలోపు, మాగాణి అయితే 3 ఎకరాలలోపు ఉంటేనే వరి స్తుంది. అలాగే విద్యార్థి కుటుంబంలో ఇన్కం ట్యాక్స్ కట్టి ఉండటం, ప్రభుత్వో ద్యోగి ఉన్నా వర్తించదు. పట్టణ ప్రాంతంలో వెయ్యి చదరపు గజాల నివాస భూమి మించకూడదు. ట్యాక్సీ, ట్రాక్టర్ మినహా ఎలాంటి ఫోర్ వీలర్ కలిగి ఉన్నా పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
0 comments:
Post a Comment