*జూన్ నుంచి మరిన్ని సచివాలయాల్లో ఆధార్ సేవలు
దాదాపు 500 సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్ సేవలందుతున్నాయి. కొత్తగా మరో 2,500 సచివాలయాల్లో ప్రారంభించనుంది. జూన్ నుంచి ప్రతి 5 సచివాలయాల్లో ఒకటి చొప్పున మొత్తం 3 వేల సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి వసాయి. ఇందుకోసం ఒక ల్యాప్‌టాప్, ఐ– స్కానర్, బయోమెట్రిక్ డివైస్ తో కూడిన ఆధార్ కిట్‌లను సచివాలయాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. మే నెలాఖరుకలా ఆధార్ కిట్లు చేరతాయని అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపుల నిర్వహణకు కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికీ ఆధార్ నమోదు చేసుకోని వారికి నమోదు చేయిస్తామని అధికారుల తెలిపారు. ఇప్పటికే ఆధార్ నమోదు చేసుకొన్న పిల్లలకు బయోమెట్రిక్ ఆధునీకరణ వంటి సేవలను ఈ క్యాంపుల ద్వారా అందించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా అధికారులు వెల్లడించారు.
0 comments:
Post a Comment