యాంటీబాడీ అంటే ఏమిటి?
వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, దానితో పోరాడటానికి కొన్ని ప్రోటీన్లు కావాల్సి ఉంటుంది. అవి వైరస్ లాగా శరీరంలో ఉంటాయి. ఇటువంటి ప్రోటీన్లను యాంటీబాడీస్ అంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి.. IGM – ఇది ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రారంభ ప్రక్రియలో పనిచేస్తుంది. ఇది వైరస్ సంక్రమణ మొదటి దశలో అభివృద్ధి చెందుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, IGM ఒక వ్యక్తి రోగనిరోధక దశలోకి ప్రవేశించినట్లు మాత్రమే చెబుతుంది. IGG – ఇందులో , యాంటీబాడీస్‌తో ఇన్ఫెక్షన్ ఆలస్యంగా గుర్తించేలా చేస్తుంది. Igg యాంటీబాడీ చాలా కాలం పాటు శరీరంలో ఉంటుంది. అయితే, యంటీబాడీస్ మన శరీరంలో ఉన్నాయో లేదో ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం యాంటీబాడీ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదో ఎలా తెలుసుకోవడం? అలాగే యాంటీబాడీ పరీక్ష చేస్తే ఏం తెలుస్తుంది?
రెండు టీకాలు వేసుకున్న తర్వాత, యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష తర్వాత శరీరంలో యాంటీబాడీస్ తక్కువగా ఉంటే, మీ శరీరంలో వ్యాక్సిన్ ప్రభావం తగ్గిందని అర్థం చేసుకోవాలి. కానీ, మీ శరీరంలో ఎక్కువ యాంటీబాడీలు ఉంటే, వ్యాక్సిన్ ఇంకా పనిచేస్తోందని అర్థం.
యాంటీబాడీ పరీక్ష చేయించుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?
యాంటీబాడీ పరీక్షను పూర్తి చేయడానికి దాదాపు రూ. 500 నుంచి రూ.1000 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డిప్కోవాన్ కిట్‌ను యాంటీబాడీ పరీక్ష కోసం అభివృద్ధి చేసింది. దీని ధర కేవలం రూ.75 మాత్రమే.
రిపోర్టు రావడానికి ఎంత సమయం పడుతుంది?
యాంటీబాడీ టెస్ట్ చేసిన తర్వాత, రిపోర్టు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. కేవలం 1-2 గంటల్లో నివేదికను అందుకుంటారు.
టీకా ద్వారా మాత్రమే యాంటీబాడీస్ తయారవుతాయా ?
టీకా వేసుకున్న తర్వాత మొదటిసారిగా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ప్రతిరోధకాలను తయారు చేస్తుంది.
రోగనిరోధక వ్యవస్థ ప్రతిరోధకాలను ఎలా తయారు చేస్తుంది?
శరీరం వ్యాధికి కారణమయ్యే బాహ్య వ్యాధికారక క్రిములు ఎంటర్ అయినప్పుడు, బాడీలోని రోగనిరోధక వ్యవస్థ ఈ వ్యాధికారక క్రిములతో పోరాడటానికి రక్షిత ప్రోటీన్‌లను తయారు చేస్తుంది. వీటినే యాంటీబాడీస్ అంటారు. యాంటీబాడీ వైరస్‌ను గుర్తించి చంపడానికి సహాయపడుతుంది. కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా మన శరీరం ప్రతిరోధకాలను తయారు చేస్తుంది.
0 comments:
Post a Comment