కొండాపురం మండలంలోని గానుగపెంట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ప్రభాకర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ శుక్రవారం మండల విద్యావనరుల కార్యాలయానికి ఉత్తర్వులొచ్చాయి. మధ్యాహ్న భోజన విషయమై గానుగపెంట సచివాలయ సంక్షేమాధికారి నరేష్ బుధవారం పాఠశాలకెళ్లారు. విద్యార్థులకు చిక్కీలు పంపిణీ చేయకపోవడంతో వాటిని ఎందుకివ్వలేదని ఉపా ధ్యాయుడ్ని ప్రశ్నించారు. విరామ సమయంలో ఇస్తామని ఉపాధ్యాయుడు సమాధానమిచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మధ్యాహ్నమే ఇవ్వాలని ఉపాధ్యాయుడికి సూచించారు. ఈ క్రమంలో వీరి మధ్య వివాదం జరిగింది. సచివా లయ సిబ్బంది ఎంపీడీవో, ఎంఈవో కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. దీనిపై గురువారం డిప్యూటీ డీఈవో విచారించి ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment