Bharat Biotech రూపొందించిన Corona వ్యాక్సిన్ Covaxin ను 6 నుండి 12 ఏళ్ల పిల్లలకు ఇచ్చేందుకు డీసీజీఐ మంగళవారం నాడు అనుమతించింది.
పుట్టిన పిల్లల నుండి ఆరేళ్లలోపు పిల్లలు మినహా అన్ని వయస్సుల వారికి కరోనా వ్యాక్సిన్ తీసుకొనేందుకు ఈ మేరకు DCGI అనుమతించినట్టైంది. దేశంలోని అందరూ కూడా Vaccine తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆరేళ్ల నుండి 12 ఏళ్ల లోపు పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకొనే వెసులుబాటును కల్పించింది.
0 comments:
Post a Comment