అమ్మఒడికి సంబంధించి ప్రస్తుతం గ్రామ సచివాలయంలో ఎలాంటి సర్వీస్ లు చేయడానికి అవకాశం లేదు.
అప్డేట్ చేసుకోవాల్సినవి..
1). తల్లి యెక్క ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండాలి. లింక్ అయినది లేనిది సంబంధిత బ్యాంక్ కి వెళ్లి సరిచూసుకోవాలి. లింక్ కాని యెడల సంబంధిత బ్యాంక్ లో మాత్రమే లింక్ చేసుకోవాలి, సచివాలయంలో చేయరు.
2). హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి మరియు స్టూడెంట్ ఇద్దరూ ఓకే మ్యాపింగ్లో ఉండాలి, వేరువేరుగా ఉండకూడదు. ఇది మీ వాలంటీర్ దగ్గర సరిచూసుకోవాలి. సచివాలయంలో కాదు.
3). హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి మరియు స్టూడెంట్ యెక్క వివరాలు ఉదా: వయస్సు, జెండర్ మొదలైనవి సరిచూసుకోవాలి. సరిగా లేనియెడల వాలంటీర్ వద్ద HH app లో అప్డేట్ e-KYC ద్వారా అప్డేట్ చేసుకోవలెను. ఇది కూడ వాలంటీర్ వద్ద అందుబాటులో కలదు. సచివాలయంలో చేయరు.
ఇట్లు
సంక్షేమ మరియు విద్య సహాయకులు
0 comments:
Post a Comment