విద్యుత్తు వాడకం నెలకు 300యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం ప్రయోజనం అందదు. 300యూనిట్లలోపు వినియోగం ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి అర్హతలను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. నవంబరు 8 నుంచి ఏప్రిల్ 30 వరకు విద్యార్థి హాజరు 75శాతం లేకపోయినా అమ్మఒడి ప్రయోజనం పొందలేరు. బియ్యం కార్డు కొత్తది ఉండాలని, కొత్త జిల్లాల నేపథ్యంలో ఆధార్‌లో జిల్లా పేరును మార్చుకోవాలని తెలిపింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకు చేసుకోవడం, బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయో లేవో విద్యార్థుల తల్లిదండ్రులు తనిఖీ చేసుకోవాలని సూచించింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment