కేవలం 14 నెలలకే ఆ చిన్నోడు అరుదైన ఘనత సాధించాడు. గూగుల్ బాయ్‌గా గుర్తింపు పొందడమే కాకుండా లండన్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు.మరో 2నెలల్లో మరో రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఆ బుడతడు ఎవరు? Google boyగా ఎందుకు గుర్తింపు పొందాడు? రికార్డు సృష్టించడానికి అతడు ఏం చేశాడు? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
సాధారణంగా చిన్నపిల్లల లోకం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా రెండేళ్ల చిన్నారులకైతే ఇల్లు, అమ్మా, నాన్న తప్ప మరో ప్రపంచం తెలియదు. అంతేకాకుండా పూర్తిగా ఆటలపైనే వాళ్ల మనసును లగ్నం చేస్తారు. మిగతా ఏ విషయాలను పట్టించుకోరు.. అస్సలు గుర్తించుకోరు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన యశస్వీ మిశ్రా మాత్రం అలాకాదు. ఈ చిన్నోడికి ఏదైన విషయం చెప్పి, దాని గురించి అడిగితే క్షణాల్లో జవాబులు చెప్పేస్తాడు. దీంతో స్థానికంగా గూగుల్ బాయ్‌గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం 16 నెలల వయసు ఉన్న ఈ చిన్నోడు.. 14 నెలలకే అరుదైన ఫీట్ సాధించాడు. ఏకంగా 26 దేశాల జాతీయ పతాకాలను వాటి రాజధానులను తడుముకోకుండా చెప్పి, లండన్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల జాతీయ పతాకాలను, వాటి రాజధానులను గుర్తించి రెండు నెలల్లో మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం యశస్వీ 194 దేశాల పతాకాలను గుర్తించగలడని అతడి తండ్రి చెబుతున్నాడు.
0 comments:
Post a Comment