పాఠశాలల్లో నాయత్వంపై ప్రధానోపాధ్యాయులకు ఆన్‌లైన్‌లో ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 3.30 నుంచి 5.30 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా ఏపీసీ ఎం.వెంకటప్పయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ శిక్షణలో పాల్గొనున్నారన్నారు. దీనికి సంబంధించి అధికారిక యూట్యూబ్ ఛానల్‌ను, దీక్ష లింకులను శిక్షణార్ధులకు పంపినట్లు తెలిపారు. ఈశిక్షణకు ముందుగా 2021- 22 విద్యాసంవత్సరానికి నేషనల్ సెంటర్ ఫర్ స్కూల్ లీడర్ షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రాథమిక, ఇంటర్మీడియట్ స్థాయి శిక్షణలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఐదురోజుల పాటు జరగనున్న కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర విద్యా విషయక సంస్థలకు చెందిన నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన వారు ఉపాధ్యాయులు, విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
Watch On DIKSHA Click Here
School Leadership HMs attendance Google Link
0 comments:
Post a Comment